26 ఏళ్ల పడుచు అధికారిణి.. వయసు మీద ఉంది. అయితే ఆమె పోస్టు మాత్రం వివిధ నేరాలు చేసి జైలుకొచ్చిన నేరగాళ్లను కనిపెట్టుకొని ఉండడం.. ఖైదీల్లో మార్పులు తీసుకురావడం.. కానీ ఆ పడుచు ప్రాయంలో ఆ ఉద్యోగంలో ఆమె కోరికలు గుర్రాలై పరిగెత్తాయి. ఇంకేముంది.. జైలులో సెక్స్ దూరంగా అలమటిస్తున్న మాంచి మగ ఖైదీలను ఎంపిక చేసుకుంది. వారితో విచ్చలవిడిగా ఆ యువ అధికారిని శృంగారం చేసింది. తోటి ఖైదీలు చూస్తున్నారన్న సిగ్గు యగ్గూ లేకుండా ఆమె ఎంజాయ్ చేసింది. తప్పులు చేస్తే శిక్షించాల్సిన లేడీ జైలర్ చేసిన ఈ పాడు పని వైరల్ అయ్యింది.
2016 నుంచి ప్రెస్నో కౌంటీల్లోని జైలులో యువ అధికారిణి టీనా పనిచేస్తోంది. ఆమె విరహ వేదనను తట్టుకోలేక ఖైదీలతో తనకు నచ్చిన సమయంలో విచ్చలవిడిగా శృంగార కార్యకలాపాల్లో పాల్గొనేది. ఓసారి 11 మంది ఖైదీలు చూస్తుండగా.. ఓ ఖైదీతో సెక్స్ లో పాల్గొంది. అంతేకాదు.. ఆమె ఖైదీలకు సెల్ ఫోన్లు బ్లేడులు సరఫరా చేసేదని.. జైల్లో సోదాలప్పుడు ముందస్తుగా సమాచారం ఇచ్చేదని తేలింది.
ఖైదీలకు ఫోన్లలో అసభ్యకరంగా మాట్లాడుతూ తాను చేసిన నేరాల గురించి గొప్పగా చెప్పుకునేదని.. ఆమె ప్రవర్తన షాకింగ్ గా ఉండేదని కోర్టులో తేల్చారు. ఆమె గత నేరచరిత్ర లేకపోవడంతో కోర్టు జైలు శిక్షను తగ్గించింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో జైలు అధికారిణి టీనా గొంజాలెజ్(26)కు న్యాయస్థానం రెండేళ్ల ప్రొబేషన్, 7 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలనం తీర్పునిచ్చింది.