
ముఖ్యమంత్రి జగన్ పరిపాలన వ్యవహారాలు స్వయంగా తానే చూసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు ఇతరులపై ఆధారపడిన ఆయన ఇక నుంచి మొత్తం పనులు చక్కెబెట్టుకుంటున్నారు. గతంలో పార్టీ వ్యవహారాలు విజయసాయిరెడ్డి చూసుకునే వారు. కానీ ఆయన ఈ మధ్య డల్ అయిపోయారు. దీంతో జగన్ వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో విజయసాయిరెడ్డి ఢిల్లీలో పాలనా వ్యవహారాలు చూసేవారు. ప్రధానితో అపాయింట్ మెంట్ అయినా త్వరగా సాధించే విజయసాయిెడ్డి ఈ మధ్య సరిగా పనిచేస్తలేరని తెలుస్తోంది. విజయసాయిరెడ్డి చక్రం ప్రస్తుతం విశాఖలో తిరుగుతోంది. ఢిల్లీలో మాత్రం ఏమీ కాకుండానే ఉంది.లేకపోతే 27 మంది ఎంపీలున్న వైసీపీకి ఉంటే ఒకే ఒక ఎంపీ రఘురామ మాట కేంద్ర ప్రభుత్వం వద్ద చెల్లడం అంటే నిజంగా వైసీపీ లాబీయింగ్ ఫెయిల్యూర్ అనుకోవాలి.
బీజేపీ వ్యవహారాలు మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వారి వ్యూహాలు ఎవరికి అర్థం కావు. జనాలనే నమ్ముకునే జగన్ కు వ్యూహాలతో పని లేదని అనుకుంటారు. వ్యూహాలను ఎప్పటికప్పుడు పదును పెట్టాల్సిందే. జగన్ బీజేపీని బాగా అర్థం చేసుకుంటున్నారు. ఆ పార్టీ తనకు దగ్గరా? దూరమా? అన్నది కూడా తేల్చుకోవాలనుకుంటున్నారు.
ఢిల్లీలో లాబీయింగ్ విషయంలో జగన్ ఇక ఎవరినీ పట్టించుకోరని, ఎవరికి బాధ్యతు అప్పగించరని అంటున్నారు. తానేస్వయంగా వ్యవహారాలు సరిచూసుకుంటున్నారు. గతంలో వేరే వారికి అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోవడంతో తానే చూసుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకనుగుణంగా చర్యలు తీసుకునే విధంగా నిర్ణయాలు ఉండాలని సూచిస్తున్నారు.