Homeజాతీయ వార్తలుIndia forex reserves: ఎకనామిక్స్ అంటేనే బ్రహ్మ పదార్థం.. అందులోనూ ఫారెక్స్ నిల్వలు అర్థం కాని...

India forex reserves: ఎకనామిక్స్ అంటేనే బ్రహ్మ పదార్థం.. అందులోనూ ఫారెక్స్ నిల్వలు అర్థం కాని సబ్జెక్టు.. దీని కథ ఏంటంటే..

India forex reserves: ఒక దేశానికి సంబంధించి ఆర్థికంగా స్థాయి లెక్కించాలంటే ఫారెక్స్ నిల్వలను ప్రామాణికంగా తీసుకుంటారు.. అవి ఆ దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఎకనామిక్స్ నిపుణులు చెబుతుంటారు. ఫారెక్స్ నిల్వలు అధికంగా ఉన్న దేశం ఆర్థికంగా బలోపేతంగా ఉంటుంది. ఆ దేశానికి ప్రపంచ వ్యాప్తంగా లభించే గౌరవం వేరే విధంగా ఉంటుంది. అందువల్లే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక నిలువలను సుస్థిరం చేసుకోవాలని భావిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనదేశానికి సంబంధించి ఫారెక్స్ విలువలను కాపాడుకోవడం దేశ పౌరులుగా మన ప్రధాన కర్తవ్యమని ఇటీవల చెప్పారు.

ఒక దేశం వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యం, బంగారం, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ వద్ద ఆదేశానికి సంబంధించిన కరెన్సీ హక్కులు (SDR), ఐఎంఎఫ్ లో సభ్యత్వం తీసుకున్నప్పుడు.. ఆ దేశం రిజర్వ్ చేసిన సొమ్ములో 25 శాతం6(RTP) .. ఇలా ఈ నాలుగింటిని కలిపి విదేశీ మారక ద్రవ్య నిల్వలు అని పిలుస్తుంటారు.. ఇవి ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. వీటిని అంచనా వేసి ఆ దేశం ఆర్థికంగా ఏ స్థాయిలో ఉందో అన్ని పనులు అంచనా వేస్తారు..

మూడీస్, ఎస్ అండ్ పీ, ఫిచ్ వంటి సంస్థలు ఫారెక్స్ రిజర్వ్ అధికంగా ఉన్న దేశాలకు అద్భుతమైన రేటింగ్ ఇస్తాయి. ఈ రేటింగ్ గనక అధికంగా ఉంటే.. ఆదేశాలకు తక్కువ వడ్డీకి అప్పులు లభిస్తుంటాయి. ఉదాహరణకు మనం లోన్ కోసం బ్యాంకు దగ్గరికి వెళ్తే.. మన సిబిల్ స్కోర్ చూస్తుంటారు. అది బాగుంటే బ్యాంక్ అధికారులు లోన్ వెంటనే మంజూరు చేస్తుంటారు. ఇదే విధానాన్ని దేశాలకు కూడా అప్పులు ఇచ్చే సంస్థ పాటిస్తుంటాయి.

ఒక దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయంటే.. విదేశీ పెట్టుబడిదారులు తాము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు లెక్క. ఒక దేశానికి సంబంధించి ఏడు నుంచి పది నెలల వరకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడానికి డబ్బులు ఉంటే.. ఆ దేశానికి సంబంధించిన పరపతి బాగున్నట్టు లెక్క. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనదేశ విదేశీ మారకద్ర నిల్వలు బాగానే ఉన్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధాలు ముగిసే పరిస్థితి కనిపించకపోవడంతో క్రుడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎరువుల ధరలు కూడా భారీగా పెరుగుతాయని సమాచారం. దీనివల్ల ఫారెక్స్ నిల్వలు మరింత దారుణంగా కరిగిపోయే ప్రమాదం ఉంది.

మన దేశానికి విదేశాల నుంచి వచ్చే డబ్బులో గల్ఫ్ ప్రాంతం నుంచి అధికంగా వస్తుంది. అక్కడ యుద్ధం వల్ల పరిస్థితులు మారిపోయాయి. మనవాళ్లు పంపే డబ్బు పూర్తిగా తగ్గిపోయింది. పైగా మన ఎగుమతుల వల రావాల్సిన డాలర్ల ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల మనకు రావలసిన డబ్బు రాకపోగా.. ఉన్న డబ్బు ఖర్చు అవుతుంది. అందువల్లే ప్రధానమంత్రి ఆ స్థాయిలో హెచ్చరికలు చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version