West Bengal Elections: దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 29న బెంగాల్లో రెండో విడత పోలింగ్ జరుగనుంది. మొదటి విడత 152 స్థానాలో పోలింగ్ జరిగింది. 93 శాతానికిపైగా పోలింగ్ జరిగింది. ఈ సరళి 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్‌ను షాక్‌కు గురిచేసింది. సర్ అమలు తర్వాత ఇంత భారీగా పోలింగ్ జరగడంతో ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఇక అధికార తృణమూల్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడినట్లు అంచనా వేస్తోంది. దీంతో మొదటి విడత ఎన్నికల తరహా ప్రచారాన్ని మార్చింది. సినీ నటి, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు సాయిలీ ఘోష్ ప్రచార శైలి ఇందుకు అద్దం పడుతోంది. ఎన్నికలకు ముందు ఒక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక గీతాలను వినిపించిన ఈమె, మొదటి విడత పోలింగ్ సరళిని గమనించిన అనంతరం తన ప్రచార వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. హిందూ ఓటర్ల ఏకీకరణను గుర్తించిన తృణమూల్ కాంగ్రెస్, ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేస్తోంది.
ఓటరు నాడితో మారిన వ్యూహం..
మొదటి విడత ఎన్నికల్లో బీజేపీకి ఊహించని స్థాయిలో ఆధిక్యత లభించిందనే సంకేతాలు తృణమూల్ కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేశాయి. గతంలో కేవలం ఒకే వర్గం ఓటర్లను నమ్ముకున్న తృణమూల్, ఇప్పుడు హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే, గతంలో ‘కళ్లలో కాబా, మనసులో మదీనా‘ అంటూ ప్రచారం చేసిన సాయిలీ ఘోష్, ఇప్పుడు ఏకంగా హనుమాన్ చాలీసా పఠిస్తూ ప్రచారంలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మారుతున్న సమీకరణాలు
బెంగాల్ ఎన్నికల్లో ముస్లిం ఓట్ల విభజన, హిందూ ఓట్ల ఏకీకరణ ఈసారి ఫలితాలను నిర్ణయించే కీలక అంశాలుగా మారాయి. మొదటి దశ ఎన్నికల తర్వాత బీజేపీ పట్ల ప్రజల్లో కనిపిస్తున్న ఆదరణను గమనించిన టీఎంసీ అభ్యర్థులు, తమ పాత వ్యూహాలను పక్కన పెట్టి, ప్రజలకు చేరువయ్యేలా ప్రచార శైలిని మార్చుకోవాలని యోచిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కూడా ఇదే బాటలో పయనిస్తూ, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటం, రాష్ట్రంలో బీజేపీకి ఉన్న పట్టుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సూచిస్తున్నా
