West Asia crisis boost to Indian tourism: భారత్ అత్యంత సుందరమైన దేశం. మన దేశంలో చారిత్రక, పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఏటా లక్షల మంది మన దేశానికి పర్యాటకులుగా వస్తున్నారు. మన దేశీయులు కూడా ఏటా సెలవుల్లో పర్యాక, పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్తుంటారు. మన దేశం నుంచి కూడా విదేశాలకు వెళ్తుంటారు. అయితే తాజగా పశ్చిమాసియా యుద్ధ భయాలు గల్ఫ్ దేశాల సందర్శనలకు బ్రేక్ పడింది. 40–50 శాతం పర్యాటకులు తగ్గారు. భద్రతా ఆందోళనలతో విమాన టికెట్లు, హోటళ్ల రద్దులు పెరిగాయి. దీని ప్రభావంతో భారతీయుల వేసవి ప్రణాళికలు మారుతున్నాయి.
దేశీయ ప్రాంతాలకు డిమాండ్..
హిమాచల్, ఉత్తరాఖండ్, లద్దాఖ్ ప్రాంతాల్లో బుకింగులు 30 శాతం పుంజుకున్నాయి. రిషికేశ్, షిల్లాంగ్, మనాలీలో చల్లని వాతావరణం వేసవి సెలవులకు ఆకర్షణగా మారాయి. 65% పర్యాటకులు దేశీయ ప్రదేశాలను ఎంచుకుంటున్నారు.
ఆధ్యాత్మిక పర్యటనలకు ప్రాధాన్యం..
దేశంలో 23 శాతం మంది ఆధ్యాత్మిక కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. హరిద్వార్, బద్రీనాథ్, కైలాస్ మానసరోవర్ మార్గాలు జనాదరణ పొందుతున్నాయి. ఈ మార్పు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు పునరుజ్జీవనం తీసుకొస్తోంది.
Also Read: హర్మూజ్ నుంచి ఆరు నౌకలు సేఫ్ గా ఇండియాకు.. మన ఎల్పీజీ కష్టాలు తీరినట్లే!
ప్రత్యామ్నాయ దేశాలకు..
ఇక విదేశాలకు వెళ్లాలనుకునేవారు గల్ఫ్ దేశాలకు ప్రత్యామ్నాయంగా వియత్నాం, నేపాల్, శ్రీలంక, థాయ్లాండ్, ఇండోనేసియా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో ఆయా దేశాలకు టూర్ డిమాండ్ 25 శాతం పెరిగింది. ట్రావెల్ ఏజెన్సీలు ఈ దేశాల్లో ప్యాకేజీలను తగ్గించి, భారతీయులను ఆకర్షిస్తున్నాయి.
స్వదేశ పర్యటన పెరుగుదల హోటళ్లు, రవాణా, స్థానిక వ్యాపారాలకు రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తుంది. గల్ఫ్ రద్దులు దేశీయ టూరిజానికి బూస్ట్ ఇచ్చింది. టోల్ ఫీజు పెరుగుదల, మొహర్ ప్రమాదాలు సవాళ్లుగా మిగిలాయి. దీర్ఘకాలంలో ఇది టూరిజం వైవిధ్యీకరణకు దారి తీస్తుంది.