https://oktelugu.com/

AP Weather: ఏపీకి పొంచి ఉన్న మరో భారీ ముప్పు

AP Weather: ఆంధ్రప్రదేశ్ లో అల్పపీడన ప్రభావం నష్టాలే తెస్తోంది. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాలు అతలాకుతలం కావడంతో తీవ్ర నష్టం సంభవించింది. దీంతో ప్రజలు కట్టుబట్టలతో ఊళ్లన్ని ఖాళీ చేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏపీలో విలయతాండవం సృష్టించిన వరద బీభత్సంతో ప్రజలు అల్లాడిపోయారు. అధికార యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడనుందని తెలుస్తోంది. దీంతో రాగల 48 గంటల్లో […]

Written By: Srinivas, Updated On : November 28, 2021 3:21 pm
Follow us on

AP Weather: ఆంధ్రప్రదేశ్ లో అల్పపీడన ప్రభావం నష్టాలే తెస్తోంది. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాలు అతలాకుతలం కావడంతో తీవ్ర నష్టం సంభవించింది. దీంతో ప్రజలు కట్టుబట్టలతో ఊళ్లన్ని ఖాళీ చేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏపీలో విలయతాండవం సృష్టించిన వరద బీభత్సంతో ప్రజలు అల్లాడిపోయారు. అధికార యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

AP Weather

దక్షిణ అండమాన్ సముద్రంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడనుందని తెలుస్తోంది. దీంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం బలపడనుందని అధికారులు తెలిపారు. దీంతో శ్రీలంక తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించనుంది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలుస్తోంది.

Also Read: ఏపీలో కొత్త జిల్లాలు.. అసలు జగన్ ప్లాన్ ఇదేనట?
ఇప్పటికే తీర ప్రాంతాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ తుపాన్ గండం పొంచి ఉండటంతో ఏపీ ప్రజల్లో వణుకు పుడుతోంది. జరిగిన నష్టంతోనే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మళ్లీ వరదలంటే మాటలా అనే ఆలోచన ప్రజల్లో వస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తున్నా ప్రజలకు మాత్రం భయాందోళన తప్పడం లేదు.

రాబోయే రోజుల్లో అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో సుమారు 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గంటకు తీరం వెంట 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Also Read: దేశంలో పేదరికం: తెలంగాణ, ఏపీ స్థానాలేంటో తెలుసా?

Tags