https://oktelugu.com/

Lakshya Movie: నాగ శౌర్య “లక్ష్య” సినిమా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే ?

Lakshya Movie: టాలీవుడ్ లో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్న నటుల్లో యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఒకరు. ప్రస్తుతం కెరీర్ పరంగా శౌర్య ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల “వరుడు కావలెను” అనే సినిమాతో మంచి విజయం సాధించారు నాగ శౌర్య. ప్రస్తుతం సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘లక్ష్య’. డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రొడక్షన్, పోస్ట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 28, 2021 / 03:26 PM IST
    Follow us on

    Lakshya Movie: టాలీవుడ్ లో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్న నటుల్లో యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఒకరు. ప్రస్తుతం కెరీర్ పరంగా శౌర్య ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల “వరుడు కావలెను” అనే సినిమాతో మంచి విజయం సాధించారు నాగ శౌర్య. ప్రస్తుతం సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘లక్ష్య’. డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఆయన రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. కేతిక శర్మ కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిలో నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

    సినిమా కోసం నాగశౌర్య భారీగా వర్క్‌అవుట్స్‌ చేసి శరీరాన్ని దృఢంగా తయారు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ తో పాటు ఇతర అప్డేట్స్ సినిమాపై బజ్ పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ఖరారు చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు మూవీ యూనిట్. డిసెంబర్ 1న ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టర్‌లో నాగ శౌర్య తీవ్రంగా వర్క్ అవుట్లు చేస్తున్నట్టుగా కన్పించాడు. ఆర్చరీ నేపధ్యంలో తెరకెక్కుతున్న భారతదేశపు మొదటి చిత్రం ‘లక్ష్య’ కావడం విశేషం.