AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కొత్త చిక్కుల్లో పడిపోతోంది. దీంతో వాటి నుంచి ప్రజలను పక్కదారి పట్టించే పనిలో జగన్ పడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త పథకాలు తెరమీదికి తెస్తున్నారు. ఇన్నాళ్లు ఇచ్చిన మాటకు జగన్ కట్టుబడి ఉంటాడని గాంభీర్యం ప్రకటించిన నేతలు ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నారు. శాసనమండలి రద్దుకు ముమ్మాటికి కట్టుబడి ఉన్నామని చెప్పిన జగన్ ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుని అపఖ్యాతి మూటగట్టుకున్నారు. జగన్ కూడా మాట మీద ఉండరనే అపవాదును తెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారంలో కూడా ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో జగన్ ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించే పనిలో భాగంగా పలు మార్గాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నా ప్రభుత్వంపై విమర్శలు తగ్గడం లేదు. దీంతో ప్రభుత్వం రాబోయే రోజుల్లో కష్టాలే ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. అందుకే ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
Also Read: ఏపీకి సినీనటులు అందుకే వరదసాయం చేయలేదా? వైసీపీ అటాక్ న్యాయమేనా?
దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన కూడా ప్రచారంలోకి తెచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాల ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా అందులో వేరే ఉద్దేశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 13 జిల్లాలు ఉండగా మరో పదమూడు జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు చెబుతోంది. ఇందులో భాగంగానే కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం అయిందని సమాచారం.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్లో పోయిన పరపతిని తిరిగి తీసుకొచ్చేందుక ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీని కోసమే అందరి దృష్టిని తమ వైపు తిప్పుకునే విధంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. మొత్తానికి వైసీపీ ప్రభుత్వం జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు తయారవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: మంత్రివర్గ విస్తరణపై ఇంకా సందేహాలేనా?