Lokpal Survey: లోక్‌పాల్.. ఈ పేరు అప్పుడప్పుడూ వినిపిస్తుంది. దేశంలో అందరినీ ఒకే అవినీతి చట్టం పరిధిలోకి తెచ్చేందుకే కేంద్రం గతంలో లోక్‌పాల్ కమిటీ వేసింది. ఈ కమిటీ ఇందుకు ప్రత్యేక గైడ్‌లైన్స రూపొందించింది. ఈ రకంగా లోక్‌పాల్ పేరు బాగా వాడుకలోకి వచ్చింది. అయితే ఈ లోక్‌పాల్ ఆ లోక్‌పాల్ కాదు. ఎన్నికల సమయంలో సర్వే నిర్వహించే సంస్థ ఇది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేసి ఓవర్‌నైట్ స్టార్ సర్వే సంస్థగా మారింది. కర్ణాటకలో కొన్ని సర్వే సంస్థలు బీజేపీకి, కొన్ని సంస్థలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. కానీ, లోక్‌పాల్ సంస్థ మాత్రం కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారం చేపడుతుందని వెల్లడించింది. ఈ సంస్థ ప్రకటించినట్లుగానే బీజేపీ గద్దె దిగింది. దీంతో సంస్థ అంచనాలు నిజమయ్యాయి.
తాజాగా తెలంగాణలో సర్వే..
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోయే తెలంగాణలోనూ లోక్‌పాల్ సంస్థ సర్వే చేసింది. ప్రీపోల్ సర్వే పేరుతో గత ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ సర్వే చేసినట్లు వెల్లడించింది. ఇందులో 60 వేల శాంపిల్స్ సేకరించినట్లు తెలిపింది.
బీఆర్‌ఎస్ గద్దె దిగుడే..
లోక్‌పాల్ సర్వే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి తప్పదని తెలిపింది. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌కు 45 నుంచి 51 సీట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. దీంతో మెజారిటీకి స్వల్ప సీట్ల దూరంలో ఆగిపోతుందని స్పష్టం చేసింది.
కాంగ్రెస్‌కు అధికారం..
ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థ లోక్‌పాల్ స్పష్టం చేసింది. తమ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 61 నుంచి 67 సీట్లు వస్తాయని తెలిపింది. ఎంఐఎంకు 6 నుంచి 8 సీట్లు వస్తాయని వెల్లడించింది.
బీజేపీకి జీరో..
ఇక తెలంగాణతో తాము అధికారంలోకి వస్తామంటున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో సున్నా నుంచి ఒక్క సీటు రావొచ్చని లోక్‌పాల్ అంచనా వేసింది. ఈ ఫలితాలు చూస్తుంటే హరీశ్‌రావు చెప్పిట్లే ఉన్నాయి. బీజేపీ డక్ ఔట్, కాంగ్రెస్ రన్ ఔట్ అన్నట్లుగా ఉన్నా.. ఇక్కడ కాంగ్రెస్ బదులు బీఆర్‌ఎస్ రన్ ఔట్ అయ్యేలా ఫలితాలు ఉన్నాయి. అయితే ఎంఐఎం మద్దతుతో బీఆర్‌ఎస్ గట్టెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి లోక్‌పాల్ సర్వే తెలంగాణలో నిజమవుతుందో లేదో..