Water Crisis Tweet Viral: మనదేశంలో విస్తారంగా నదులున్నాయి. లెక్కకు మిక్కిలి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ తాగినీటి ఎద్దడి అనేది ఇప్పటికీ పరిష్కారం కానీ సమస్యగానే ఉంది. తాగునీటి సరఫరా కోసం ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎన్నో కోట్లు ఖర్చు చేశాయి. ఆయనప్పటికీ మారుమూల గ్రామాలకు, ప్రాంతాలకు తాగునీరు సరఫరా కావడం లేదు.
మారుమూల గ్రామాలకు మాత్రమే కాదు.. పట్టణాలలో కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నగరాలలో కూడా ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తాగునీటిని నగరాలకు సరఫరా చేయడానికి నదుల నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్లను ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. దీనికోసం కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఏకంగా బడ్జెట్లో కొంత భాగాన్ని కూడా కేటాయిస్తున్నాయి. అయితే తాగునీటి సమస్యకు వనరుల మీద ఒత్తిడి మాత్రమే కాదు, ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాన్ని వైద్యరోగ్య శాఖ మాజీ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఒక ఫోటోను పోస్ట్ చేసి.. అందులో కీలక విషయాలను వెల్లడించారు. ఆ ట్వీట్ ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.
Also Read: Lemon Water: చలికాలంలో నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి హానికరమా? ఇందులో నిజమెంత?
నీరు చాలా విలువైంది
ప్రస్తుతం నగరాలలో, పట్టణాలలో తాగినటి కొరత అధికంగా ఉంది. అందువల్లే ప్రతిరోజు అపార్ట్మెంట్లలో వాటర్ ట్యాంకర్లు కనిపిస్తుంటాయి. నీటి వనరుల మీద ఉన్న ఒత్తిడి, వనరులు లేకపోవడం వల్ల మాత్రమే కాకుండా ఇంకా అనేక కారణాలు తాగునీటి ఎద్దడికి కారణమవుతున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి హర్షవర్ధన్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. ట్విట్టర్లో కేంద్ర మాజీ మంత్రి పోస్ట్ చేసిన ఫోటోలో.. ట్యాంకర్ నుంచి వృధాగా నీరు పోతున్న దృశ్యం కనిపించింది. నగరంలోని ఓ ప్రాంతంలో ఉన్న ట్యాంకులో నుంచి నీరు వృధాగా పోతోంది. ఓ ప్రాంతంలో ఉన్న ట్యాంక్ లోకి నీటిని ఎక్కించే క్రమంలో చేసిన నిర్లక్ష్యం వల్ల..ట్యాప్ నుంచి నీరు వృధాగా పోవడం మొదలైంది. ఈ దృశ్యాన్ని హర్షవర్ధన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు..” మనదేశంలో తాగునీటి ఎద్దడికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి నిర్లక్ష్యం కూడా తాగునీటి ఎద్దడికి ఓ కారణం. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి కారణం వల్ల రోజుకు వందల లీటర్ల నీరు వృధాగా పోతోంది. ట్యాంక్ నిండక ముందే మోటార్ ఆఫ్ చేయాలి. అప్పుడే ఈ సమస్యకు కాస్తలో కాస్త పరిష్కారం లభిస్తుంది.. నీటి వనరులపై ఒత్తిడి పెంచకూడదు.. ఇష్టాను సారంగా వాడకూడదని” హర్షవర్ధన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. హర్షవర్ధన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చాలామంది కేంద్ర మాజీ మంత్రి ట్వీట్ తో ఏకీభవించారు.. వాస్తవ పరిస్థితిని హర్షవర్ధన్ వెల్లడించారని.. చాలామంది ఇలా చేస్తే నీటి వృధా తగ్గిపోతుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా భావిస్తున్నారు.
पानी की टंकी को ओवरफ्लो नहीं होने दें| पानी की बर्बादी को रोकें | समय-समय पर टंकी के वॉल्व को चेक करते रहें। आप स्मार्ट सिस्टम्स का इस्तेमाल कर पानी की बर्बादी को रोक सकते हैं। #GreenGoodDeeds@PMOIndia @moefcc pic.twitter.com/KuEJO5oRut
— Dr Harsh Vardhan (@drharshvardhan) June 23, 2025