https://oktelugu.com/

పవన్ కళ్యాణ్ ట్రోల్స్ బారిన పడ్డాడా?

జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఏకంగా కేఏపాల్ తో పోల్చుతూ కామెడీ చేసుకుంటున్నారు. కేఏపాల్ ఎంత సీరియస్ గా హిలేరియస్ కామోడీ చేస్తారో..పవన్ కూడా అలాగే కామెడీ చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. దీంతో పపన్ కల్యాణ్ నోరు విప్పకపోతేనే బావుంటుందని అనుకుంటున్నారు. Also Read: కేసీఆర్ వ్యూహం దెబ్బకొడుతోందా..? తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఎమ్మెల్సీ క‌విత ఐదేళ్ల క్రితం మాట్లాడిన మాట‌లు… […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2020 / 11:32 AM IST
    Follow us on

    జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఏకంగా కేఏపాల్ తో పోల్చుతూ కామెడీ చేసుకుంటున్నారు. కేఏపాల్ ఎంత సీరియస్ గా హిలేరియస్ కామోడీ చేస్తారో..పవన్ కూడా అలాగే కామెడీ చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. దీంతో పపన్ కల్యాణ్ నోరు విప్పకపోతేనే బావుంటుందని అనుకుంటున్నారు.

    Also Read: కేసీఆర్ వ్యూహం దెబ్బకొడుతోందా..?

    తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఎమ్మెల్సీ క‌విత ఐదేళ్ల క్రితం మాట్లాడిన మాట‌లు… ఇప్పుడు గ్రేట‌ర్ ఎన్నిక‌ల పుణ్య‌మా అని మ‌ళ్లీ సోష‌ల్ మీడియా తెర‌పైకి వ‌చ్చాయి. “నాకు విప్ల‌వం అంటే ఇష్టం. నాకు విప్ల‌వ భావ‌జాలం ఉంది. నాకు పేద ప్ర‌జ‌లంటే ఇష్టం. పేద ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసు. పేద ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలిసినోడు ఎవ‌ర‌న్నా ఫైవ్‌స్టార్ హోట‌ల్లో మీటింగ్ పెడ‌తాడా? ఎల‌క్ష‌న్లు వ‌స్తున్నాయంటే మేక‌ప్ అని చెప్ప‌డం, ఎల‌క్ష‌న్లు కాగానే పేక‌ప్ అని చెప్ప‌డం.’ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి రిపీట్ అవుతూ వైరల్ అవుతున్నాయి.

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. ఆయన మాత్రం ఎప్పటికప్పుడు రాజకీయాల్లో తన మార్కు చూపించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉన్నట్టుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రేటర్ హైదరాబాద్‌ పై పడ్డాడు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కవిత విడియో చక్కర్లు కొడుతోంది.

    నాలుగు రోజుల క్రితం ఇదే ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కార్య‌క‌ర్త‌ల నుంచి డిమాండ్ ఉండ‌డం వ‌ల్లే పోటీకి దిగాల్సి వ‌స్తుంద‌ని ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్‌తో పొత్తు విష‌య‌మై చ‌ర్చించ‌డానికి బండి సంజ‌య్ వ‌స్తున్న‌ట్టు జ‌న‌సేన మీడియా కోఆర్డినేట‌ర్ ప్ర‌క‌టించారు. అదీ లేదు. ఆ త‌ర్వాత కిష‌న్‌రెడ్డి, ల‌క్ష‌ణ్ వెళ్లి ప‌వ‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.

    Also Read: టీఆర్ఎస్ కు తమిళసై తిప్పలు

    ఇప్పటికే పవన్ కళ్యాణ్ తనకు తెలిసీ తెలియని మాటలతో ఆయనకు రాజకీయ విజ్ఞత లేదని.. గందరగోళంలో ఉన్నాడని…. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అంటూ… కొంతమంది అయితే అసలు పవన్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు.  అందుకే జీహెచ్ఎంసీ ఎపిసోడ్ తర్వాత పవన్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ ఎక్కువై పోయాయట..

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్