https://oktelugu.com/

అల్లు అర్జున్ కూతురు అర్హ.. వీడియో చేసింది అతడేనా?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్ష బర్త్ డే సందర్భంగా నిన్న ఓ వీడియో విడుదలైంది. అంజలి.. అంజలి అంటూ సాగే వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చేసింది.. ఎవరా? అనేది ఆసక్తి అందరిలో నెలకొంది. దీనికి సమాధానం వీడియో చివర్లో దొరుకుతుంది. Also Read: మరో బాంబ్ పేల్చిన వర్మ.. ఈసారి ఏం చేస్తాడో? అంజలి.. అంజలి వీడియో సాంగులో అర్హ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2020 / 11:46 AM IST
    Follow us on

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్ష బర్త్ డే సందర్భంగా నిన్న ఓ వీడియో విడుదలైంది. అంజలి.. అంజలి అంటూ సాగే వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చేసింది.. ఎవరా? అనేది ఆసక్తి అందరిలో నెలకొంది. దీనికి సమాధానం వీడియో చివర్లో దొరుకుతుంది.

    Also Read: మరో బాంబ్ పేల్చిన వర్మ.. ఈసారి ఏం చేస్తాడో?

    అంజలి.. అంజలి వీడియో సాంగులో అర్హ నటన ఆకట్టుకుంది. బేబి శ్యామిలీని గుర్తుచేసేలా అర్హ నటన ఉంది. ఇక వీడియోలో అల్లు అర్జున్ తోపాటు అతడి కుమారుడు అల్లు అయాన్.. అల్లు అర్జున్ నాన్న అల్లు అరవింద్ కొన్ని సీన్లలో కన్పించి ఆకట్టుకున్నారు. మొత్తానికి ఈ వీడియో అభిమానులను అలరించింది.

    ఈ వీడియోను త్రివిక్రమ్ స్నేహితుడు కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ సాయి తెరకెక్కించాడు. సాయి గతంలో కన్నడలో ఏదో సినిమా చేశాడు తప్ప తెలుగులో మాత్రం ఆయనకు ఛాన్స్ రాలేదు. రెండు మూడేళ్ల కిందటే సాయి త్రివిక్రమ్ క్యాంప్ ను వదిలేసి బన్నీ దగ్గరకు వచ్చి చేరాడు. అప్పటి నుంచి బన్నీ సినిమాలకు సంబంధించిన స్క్రీప్టు వ్యవహరాలు చూస్తుండిపోయాడు.

    Also Read: బికినీలో కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తున్న రకుల్

    తాజాగా అల్లు అర్హ బర్త్ డే సందర్భంగా అతడి పేరు టైటిల్ కార్డుపై పడే అవకాశం అతడికి దక్కింది. అంజలి పాటకు సంబంధించిన టెక్నికల్ టీమ్ వర్క్.. వీడియో కవరింగ్ మొత్తం సాయినే దగ్గరుండి చేయించాడు. ఇందుకు నిదర్శనంగా వీడియో చివర్లో సాయి గోపాల్ రామ్మూర్తి పేరు వేసుకున్నాడు. ఎట్టకేలకు తనలో విషయం ఉందని సాయి నిరూపించుకున్నాడు. ఇలానే అతడు కొనసాగితే తెలుగులో అతడికి ఆఫర్లు రావడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్