Homeజాతీయ వార్తలుSatya Pal Malik: అంబానీ కంపెనీ ఫైల్ పై సంతకానికి లంచం రూ.150 కోట్లా?

Satya Pal Malik: అంబానీ కంపెనీ ఫైల్ పై సంతకానికి లంచం రూ.150 కోట్లా?

Satya Pal Malik: జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్, ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలను స్తంభింపజేసే విధంగా ఆరోపణలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తాను అవినీతికి పాల్పడనని నీతి చర్యలకే పెద్దపీట వేస్తానని ప్రకటించారు. అవినీతి పనులకు తాను దూరమని చెప్పుకొచ్చారు. తాను జమ్ముకశ్మీర్ లో గవర్నర్ గా పనిచేస్తున్న సమయంలో తన వద్దకు ఓ రెండు ఫైళ్లు వచ్చాయి. అవి ఓ పారిశ్రామిక వేత్తకు చెందినవిగా గుర్తించడంతో వాటిపై సంతకం చేయలేదని తెలిపారు.
Satya Pal Malik
అయితే వాటిపై సంతకం చేస్తే రూ.150 కోట్ల లంచం ఇచ్చందుకు అవతలి వారు సిద్ధపడినట్లు వెల్లడించారు. కానీ తాను దారి తప్పలేదని సూచించారు. నీతికే పెద్దపీట వేసి అవినీతిని ముట్టుకోలేదని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడే బదులు తన పదవిని వదులుకోవడానికే సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అవినీతిపై రాజీ పడాల్సిన పని లేదని తెగేసి చెప్పారు. సత్యపాల్ మాలిక్ ఆగస్టు 21 2018లో జమ్ముకశ్మీర్ గవర్నర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. సంవత్సరం తరువాత అక్టోబర్ 2019లో గోవాకు బదిలీ అయ్యారు.

మేఘాలయ గవర్నర్ గా ఉంటున్న సమయంలో కూడా మరో ఫైలు వచ్చిందని గుర్తు చేశారు. అది కూడా ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉన్న వ్యక్తికి చెందిన ఫైలుగానే చెప్పారు. దానిపై కూడా సంతకం చేస్తే రూ.150 కోట్ల లంచం వస్తుందని తెలిసినా దాన్ని కూడా పక్కన పెట్టినట్లు పేర్కొన్నారు. దీంతో గవర్నర్ నిర్వాకంతో అవినీతి అంతం అయిందనే చెప్పుకొచ్చారు.

గవర్నర్లకే లంచం ఇచ్చేందుకు సిద్ధపడ్డారంటే అవినీతి ఎంత మేర పెరిగిపోతోందో ఇట్టే అర్థమైపోతోంది. మరో విషయంలో రిలయన్స్ కంపెనీ కూడా జనరల్ బీమా కోసం చేసుకున్న ఒప్పందాన్ని సత్యపాల్ రద్దు చేశారు. మరోవైపు కశ్మీర్ పీడీపీ అధ్యక్షురాలు ముఫ్తీ సత్యపాల్ పై రూ.10 కోట్ల దావా వేశారు. ఆమె గవర్నర్ కు లీగల్ నోటీసు పంపించారు. తన పరువుకు భంగం కలిగేలా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే పరువు నష్టం కట్టాల్సి వస్తుందని హెచ్చరికలు చేశారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular