Bommarillu Bhaskar: దర్శకుడు భాస్కర్ అంటే పెద్దగా అందరికీ తెలియక పోవచ్చు . బొమ్మరిల్లు భాస్కర్ మంచి గుర్తింపు పొందారు ఈ తెలుగు డైరెక్టర్. బొమ్మరిల్లు సినిమా తో సూపర్ హిట్ అందుకున్నారు. ఆరెంజ్ సినిమా మ్యూజికల్ ఆల్బమ్ గా హిట్ అయినా సినిమా మాత్రం థియేటర్లో ఫ్లాప్ అయ్యింది. ఒంగోలు గిత్త చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు.

వరుస సినిమాలతో ఫ్లాప్ లు అందుకున్న ఈ దర్శకుడు కి ఇండస్ట్రీలో కూడా అవకాశాలు తగ్గాయని చెప్పాలి.అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ఈ నెలలోనే దసరా సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ కి అక్కినేని అఖిల్ కి హిట్ ఇచ్చింది అనే చెప్పాలి.
ఇటీవలే సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్ స్టైలిస్ట్ స్టార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సక్సెస్ మీట్ లో బన్నీ దర్శకుడు భాస్కర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. సినిమా మేకింగ్ విషయంలో భాస్కర్ ని బాగా ఇబ్బంది పెట్టమని… కానీ అనుకున్నా దానికంటే ఎక్కువ సాధించాడు అంటూ బన్నీ మాట్లాడారు. అక్కినేని నాగార్జున ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని కొన్ని మార్పులు చెప్పారట. నిర్మాతలు, నాగార్జున చేసిన మార్పులు, చేర్పుల వలనే సినిమా ఇంకా మంచి హిట్ గా నిలిచింది అనుకుంటున్నారు.
ప్రస్తుతం గీతాఆర్ట్స్ సంస్థ బొమ్మరిల్లు భాస్కర్ కి మరో ఆఫర్ ఇచ్చినట్లు సినిమా ఇండస్ట్రీలో సమాచారం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి హిట్ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ అందుకుంటారు లేదో ఈసారి ఎలాంటి కథ తో ప్రేక్షకులను అలరించనున్నారొ… చూడాలి మరి.