https://oktelugu.com/

Rape case: పోస్టుమార్టం కాగానే నిందితుడు రాజును కాల్చేశారు

Rape case : తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజు ఊపిరి గాల్లో కలిసిపోయింది. పొద్దున రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న అతడిని పోలీసులు వరంగల్ ఎయిమ్స్ కు తరలించి పోస్టుమార్టం చేశారు. పోస్టుమార్టం అయిన వెంటనే అతడిని అక్కడే కాల్చేయడం గమనార్హం. వారం రోజులుగా తప్పించుకు తిరుగుేతున్న రాజు అనూహ్యంగా ఈరోజు ఉదయం రైలు పట్టాలపై శవమై తేలాడు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2021 / 10:02 PM IST
    Follow us on

    Rape case : తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజు ఊపిరి గాల్లో కలిసిపోయింది. పొద్దున రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న అతడిని పోలీసులు వరంగల్ ఎయిమ్స్ కు తరలించి పోస్టుమార్టం చేశారు. పోస్టుమార్టం అయిన వెంటనే అతడిని అక్కడే కాల్చేయడం గమనార్హం.

    వారం రోజులుగా తప్పించుకు తిరుగుేతున్న రాజు అనూహ్యంగా ఈరోజు ఉదయం రైలు పట్టాలపై శవమై తేలాడు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు.

    ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైల్వే ట్రాక్ పై నిందితుడు ఆత్మహత్యకు పాల్పడడంతో పోలీసులు నిందితుడు రాజుగా పచ్చబొట్టు ఆధారంగా గుర్తించి సమీపంలోని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

    ఈ క్రమంలోనే రాజు రక్త సంబంధీకులకు మృతదేహాన్ని చూపించి అతడిదేనని మరోమారు నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు నుంచి రాజు కుటుంబ సభ్యులను రప్పించారు. మృతదేహానికి పోస్టుమార్టం కోసం సంతకాలు తీసుకున్నారు.మృతదేహాం రాజుదేనని కుటుంబ సభ్యులు కన్ఫార్మ్ చేశారు.

    అనంతరం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి సంతకం తీసుకొని డెడ్ బాడీని అప్పగించారు.

    అయితే రాజు అంత్యక్రియలు స్వగ్రామం అడ్డగూడురులో చేస్తారని అంతా అనుకున్నారు.కానీ రాజు కుటుంబ సభ్యులు, బంధువులు అప్పటికప్పుడే వరంగల్ లోనే మృతదేహాన్ని దహనం చేశారు.

    వరంగల్ నగరంలోని పోతన కాలనీ శ్మశాన వాటికలో రాజు అంత్యక్రియలు నిర్వహించారు. కట్టలపై పేర్చిన రాజు మృతికి తల్లి వీరమ్మ నిప్పంటించారు. దీంతో రాజు మృతదేహం చితిమంటల్లో కాలిబూదైంది. రాజు తల్లి, భార్య గుండెలవిసేలా రోదించారు.

    అయితే రాజును పోస్టుమార్టం చేసిన వెంటనే వరంగల్ లోనే దహనం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కేసు తీవ్రత దృష్ట్యానే ఇలా చేసినట్టుగా తెలుస్తోంది.