Pushpa Movie Leaks: షాకింగ్.. పుష్ప మూవీల నుంచి లీకులే లీకులు

  allu arjun pushpa movie scene leaked : అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’(Pushpa). ఈ చిత్రం ఇప్పటికే చాలా సార్లు లీకుల బారిన పడింది. పుష్ప నుంచి కొన్ని పాటలు, ఫైట్లు లీక్ అయ్యాయి. ‘దాక్కో దాక్కో మేక’ పాటను కూడా కొందరు మొబైల్ లో తీసి విడుదల చేశారు. ఇక ఫైట్ సీన్లను ఎడిటింగ్ రూంలోంచి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిర్మాతలు దీనిపై […]

Written By: NARESH, Updated On : September 16, 2021 9:45 pm
Follow us on

 

allu arjun pushpa movie scene leaked : అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’(Pushpa). ఈ చిత్రం ఇప్పటికే చాలా సార్లు లీకుల బారిన పడింది. పుష్ప నుంచి కొన్ని పాటలు, ఫైట్లు లీక్ అయ్యాయి. ‘దాక్కో దాక్కో మేక’ పాటను కూడా కొందరు మొబైల్ లో తీసి విడుదల చేశారు. ఇక ఫైట్ సీన్లను ఎడిటింగ్ రూంలోంచి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిర్మాతలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంత జరుగుతున్నా కూడా అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీకి సంబంధించిన లీక్ లు ఆగడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా లీకులు వెలువడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అండ్ చిత్రం యూనిట్ కాకినాడలో ఉంది. వారు కీలక ఫైట్ సన్నివేశాలను కాకినాడ పోర్టులో తెరకెక్కిస్తున్నారు. భారీ తారగాణం, ఫైటర్స్ తో కలిసి సుకుమార్ దీన్ని తీస్తున్నారు. ఇక్కడ లీకులు అయ్యాయి.

తాజాగా అల్లు అర్జున్ ఫైట్ సీన్ చేసే కాకినాడ పోర్టు నుంచి ఒక వీడియో లీక్ అయ్యింది. అంతేకాదు.. ఒక పైపు సందులోంచి అల్లు అర్జున్ షూటింగ్ స్పాటులో ఉన్న లుక్ ఒకటి బయటకు వచ్చింది.

అల్లు అర్జున్ , సుకుమార్ లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా లీకుల బెడద మూవీకి తప్పడం లేదు. ఫోన్లు షూటింగ్ స్పాట్ కు నిషేధించినా.. యూనిట్ ఎంత చెక్ చేసి రప్పిస్తున్నా కూడా ఈ లీకులు అవుతూనే ఉన్నాయి. ఇది సినిమాకే పెద్ద ముప్పు అని.. వెంటనే నియంత్రించాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.

దాదాపు 100 కోట్ల వ్యయంతో పుష్ప మూవీని రెండు పార్టులుగా తీస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రం తొలి పార్ట్ ను కాకినాడలో ప్రస్తుతం కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఈక్రమంలోనే లీకేజీలు మళ్లీ చిత్రం యూనిట్ కు శరాఘాతంగా మారాయి.

లీక్ వీడియోలు, ఫొటోలు

https://twitter.com/Mahesh15493095/status/1333987386234073090?s=20

https://twitter.com/Thrille32299775/status/1437701894101635073?s=20