Homeజాతీయ వార్తలుBandi Sanjay KTR War: బీజేపీకి అస్త్రంలా మారిన కేటీఆర్ వ్యాఖ్య‌లు.. ట‌చ్ చేసి చూడు...

Bandi Sanjay KTR War: బీజేపీకి అస్త్రంలా మారిన కేటీఆర్ వ్యాఖ్య‌లు.. ట‌చ్ చేసి చూడు అంటున్న సంజ‌య్‌..!

Bandi Sanjay KTR War: బీజేపీకి అవ‌త‌ల పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలే పెద్ద అస్త్రాలని మనందరికీ తెలిసిందే. ప్ర‌తిప‌క్ష పార్టీ వాళ్లు ఆవేశంలో మాట్లాడే మాటలను తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయాలు చేయడంలో బీజేపీ తరువాతే ఎవరైనా. ఈ విషయం బాగా తెలిసిన కేటీఆర్.. మరోసారి బీజేపీకి లేని అవకాశాన్ని కల్పించారు. ఇక బీజేపీ ఊరుకుంటుందా.. చెడుగుడు ఆడేసుకుంటుంది.

Bandi Sanjay KTR War
Bandi Sanjay and KTR

మొన్న అసెంబ్లీలో కంటోన్మెంట్ ఏరియాపై చర్చకు వచ్చినప్పుడు కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మిలటరీ ఏరియాకు నీళ్లు, కరెంట్ ఆపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ సమస్య ఏదైనా సరే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని అందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే దేశాన్ని రక్షిస్తున్న మిలటరీకి కేటీఆర్ గౌరవం ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని తెర‌మీద‌కు తెస్తున్నారు బీజేపీ నేత‌లు.

Also Read: వాకిలీ ఊడిస్తే తెలంగాణ అభివృద్ధి చెందినట్టే.. మంత్రి మల్లన్నా.. నీ కామెడీ సూపర్ అన్నా!

మరి మిలిటరీని అవసరమైనప్పుడల్లా వాడుకునే బీజేపీ.. ఇప్పుడు ఊరుకుంటుందా. లేని అస్త్రం దొరకడంతో కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు అధ్యక్షుడు బండి సంజయ్. కంటోన్మెంట్ ఏరియాను టచ్ చేసి చూడు అంటూ వార్నింగ్ లు ఇచ్చేస్తున్నారు. కంటోన్మెంట్ ఏరియా హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. అక్కడ ఇలాంటి డెవలప్ మెంట్ చేయాలన్నా మిలటరీ పర్మిషన్ తప్పనిసరి. ఇదే ఇప్పుడు కేసీఆర్ సర్కార్ కు అస్సలు నచ్చట్లేదు.

ఈ క్రమంలోనే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసలే నాలుగు రాష్ట్రాల్లో గెలిచిన జోష్ లో ఉన్న బీజేపీ నేతలు.. దొరికిన ఈ అవకాశాన్ని పూర్తిగా వాడేసుకుంటున్నారు. కేవలం వ్యాఖ్యలతోనే సరిపెట్టకుండా మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అసలే ముందస్తుకు సమాయత్తం అవుతున్న సమయంలో కేటీఆర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్ కు నష్టం చేకూరుస్తుంది అంటున్నారు రాజకీయ విమర్శకులు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్, బీజేపీ బుల్డోజర్లు పనిచేస్తాయా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

Comments are closed.

Exit mobile version