https://oktelugu.com/

OkTelugu Movie Time : తెలుగు ప్రజెంట్ లేటెస్ట్ అప్ డేట్స్ !

OkTelugu Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. మహేష్ బాబు సరసన ‘మురారీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన సోనాలి బింద్రే. తొలి సినిమానే సూపర్ హిట్ కావడం..ఆ తర్వాత మన్మధుడు, ఇంద్ర, శంకర్ దాదా MBBS లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. ఇప్పుడు దాదాపు 18ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. తారక్-కొరటాల శివ కాంబోలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 14, 2022 / 04:30 PM IST
    Follow us on

    OkTelugu Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. మహేష్ బాబు సరసన ‘మురారీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన సోనాలి బింద్రే. తొలి సినిమానే సూపర్ హిట్ కావడం..ఆ తర్వాత మన్మధుడు, ఇంద్ర, శంకర్ దాదా MBBS లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. ఇప్పుడు దాదాపు 18ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. తారక్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఆమెను సంప్రాదించారట.

    Sonali Bendre

    మరో అప్ డేట్ ఏమిటంటే.. సూర్య నటించిన జై భీమ్‌ ఇప్పటివరకు IMDb లో అత్యధిక రేటింగ్‌ సాధించిన భారత చిత్రంగా ఉంది. IMDb డేటా బేస్‌లో జైభీమ్‌కి 9.5/10 లభించింది. అయితే ఇటీవల విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గానూ దూసుకుపోతున్న ది కశ్మీర్‌ ఫైల్స్‌ జై భీమ్‌ని బీట్‌ చేసింది. IMDb లో 10/10కి సాధించి ఔరా అనిపించింది. ఇటీవల ఈ చిత్ర బృందాన్ని మోడీ కూడా తన దగ్గరకు పిలిపించుకొని మరీ అభినందించారు.

    The Kashmir Files

    ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. కశ్మీర్‌లో హిందూ పండిట్‌ల కష్టాలను కళ్లకు కట్టిన చిత్రం ది కశ్మీర్‌ ఫైల్స్‌. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఎవరూ ముందుకు రాలేదని జాతీయ ఉత్తమ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తెలిపారు. అయితే తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ముందుకొచ్చి ఈ చిత్రాన్ని నిర్మించారు.

    కాగా విడుదలకు అష్టకష్టాలు పడి, చివరకు మార్చ్‌ 11న రాధేశ్యామ్‌తో పోటీపడి విడుదలైంది. ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటూ సూపర్‌ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

    Also Read: Ganta Srinivasarao: రాజీనామా కోసం గంటా పట్టు.. జనసేనలోకి జంపింగా?

    Tags