https://oktelugu.com/

Prabhas Project-K: ‘సాంకేతికత – ప్రకృతి’ కలిసే చోటులో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ !

Prabhas Project-K: నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ కోసం ఆనంద్‌ మహీంద్రాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ట్విట్టర్ ద్వారా సహాయం కోరిన సంగతి తెలిసిందే. ఆనంద్‌ మహీంద్రా కూడా సానుకూలంగా స్పందిస్తూ.. ‘ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎలా తిరస్కరిస్తాం నాగ్‌ అశ్విన్‌. మా గ్లోబల్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ వేలు మహీంద్రా మీకు సహకారం అందిస్తారని బదులిచ్చారు. అయితే, ప్రాజెక్ట్ కె’ సినిమా పనుల్లో భాగంగా ఆదివారం మహీంద్రా […]

Written By:
  • Shiva
  • , Updated On : March 14, 2022 / 04:19 PM IST
    Follow us on

    Prabhas Project-K: నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ కోసం ఆనంద్‌ మహీంద్రాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ట్విట్టర్ ద్వారా సహాయం కోరిన సంగతి తెలిసిందే. ఆనంద్‌ మహీంద్రా కూడా సానుకూలంగా స్పందిస్తూ.. ‘ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎలా తిరస్కరిస్తాం నాగ్‌ అశ్విన్‌. మా గ్లోబల్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ వేలు మహీంద్రా మీకు సహకారం అందిస్తారని బదులిచ్చారు.

    Project-K

    అయితే, ప్రాజెక్ట్ కె’ సినిమా పనుల్లో భాగంగా ఆదివారం మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి వెళ్లారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సందర్భంగా.. “సాంకేతికతను ప్రకృతి కలిసే చోటు” అంటూ ఆ క్యాంపస్స్ ను కొనియాడారు. ఇక ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి అనేక రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా పై అధికారిక అప్ డేట్ కావాలంటూ గత కొంత కాలంగా ట్విట్టర్ లో సినిమా మేకర్స్ కి మెసేజ్ లు పెడుతూ వస్తున్నారు.

    Also Read: Rajamouli To Meet Y S Jagan: జగన్ ను రాజమౌళి ఎందుకు కలుస్తున్నాడు ?

    అయితే, సినిమా యూనిట్ ప్రస్తుత ప్లాన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక గేమ్ షోను గ్రాండ్ గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే వారంలో యాక్షన్ సీన్స్ కోసం సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ సీన్స్ షూట్ ను శరవేగంగా షూట్ చేయనున్నారు. ఇక మొదటినుంచీ ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

    అందుకే నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా కథ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఈ సినిమా నేపథ్యం మొత్తం ఓ దీవిలో సినిమా జరుగుతుందట. ప్లాష్ బ్యాక్ లో ఈ దివి సీన్స్ వస్తాయని.. అలాగే సినిమాలో మూడు కాలాలకు సంబంధించిన కథ ఉంటుందని.. అయితే అన్నిటిలోకల్లా దివి తాలూకు సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది.

    Also Read: Viral Cinema: వైరల్ అవుతున్న టుడే మూవీ డేట్స్ !

    అలాగే ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ కథలో రెండు విభిన్న పాత్రలను సృష్టించాడని.. పైగా పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా ప్లాన్ చేస్తున్నాడని.. అందుకే అన్ని భాషల వారికి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని టీమ్ నమ్మకంగా ఉంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని భారీగా నిర్మించనున్నారు. మొత్తం సాంకేతిక బృందాన్ని కూడా హాలీవుడ్ లోని ప్రముఖులనే తీసుకుంది.

    Tags