టాలీవుడ్ ను కంట్రోల్ చేస్తున్న జగన్?

కరోనా కారణంగా రెండేళ్ల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో కారణంగా మరింత కష్టాల్లో పడనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి దాదాపు ఏడేళ్లకు పైగా అవుతోంది. ఏపీకి చెందిన ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు. అయితే చిత్ర పరిశ్రమ మాత్రం ఏపీకి రానంటోంది. ఎంతసేపు కేసీఆర్ చుట్టే తిరుగుతూ హైదరాబాద్ ను విడిచిపెట్టనంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ […]

Written By: NARESH, Updated On : July 14, 2021 8:35 am
Follow us on

కరోనా కారణంగా రెండేళ్ల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో కారణంగా మరింత కష్టాల్లో పడనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి దాదాపు ఏడేళ్లకు పైగా అవుతోంది. ఏపీకి చెందిన ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు. అయితే చిత్ర పరిశ్రమ మాత్రం ఏపీకి రానంటోంది. ఎంతసేపు కేసీఆర్ చుట్టే తిరుగుతూ హైదరాబాద్ ను విడిచిపెట్టనంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ టాలీవుడ్ ను దారికి తెచ్చుకునేందకు జీవో జారీ చేశాడన్న చర్చ హాట్ హాట్ గా సాగుతోంది.

దాదాపు మూడేళ్ల పాటు రాజకీయాల్లో ఉండి ఆ తరువాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. ఆయన నటించిన ‘వకీల్ సాబ్’ ప్రభంజనం సృష్టించింది. విడుదలకు ముందే భారీ రేటుకు అమ్ముడుపోయింది. ఈ నేపథ్యంలో డిస్ట్రీబ్యూటర్లు, థియేటర్ల యజమానులకు కొత్త కళ వచ్చినట్లయింది. అయితే ఇక్కడే ఏపీ ప్రభుత్వం వారికి షాక్ ఇచ్చింది. థియేటర్ల యజమానులు తమకు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేది లేదని తేల్చి చెప్పింది. కొన్ని చోట్ల సినిమాను కూడా ఆపేసింది. దీంతో రెండు రోజుల ఎర్లీ మార్నింగ్ షో ను వారు కోల్పోయి కోట్లల్లో నష్ట పోయారు.

ఇప్పటి వరకు పెద్ద హీరోలకు చెందిన సినిమాలు వచ్చినవి.. వస్తున్నవి భారీ బడ్జెట్ తో కూడుకున్నవే. దీంతో డిస్ట్రిబ్యూటర్లు స్పెషల్ షో వేసి లాభాల పంట పండిచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మాత్రం రేట్లు పెంచడానికి ఒప్పుకోవడం లేదు. ఇలా అయితే తాము భారీ రేటు పెట్టి సినిమాను ఎలా కొనగలమని కొందరు అంటున్నారు. దీంతో సినిమాపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎటోచ్చి ఈ సమస్య నిర్మాతల దగ్గరికే వెళ్తుంది.

ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా సినీ పెద్దలు, బడా హీరోలు ఏపీ ప్రభుత్వానికి విన్నపాలు పెట్టుకుంటోంది. అయితే గతంలో ఏపీని పట్టించుకోకుండా తెలంగాణ వైపే ఉన్న సినీ ఇండస్ట్రీ ఇప్పుడు ఏపీ పెట్టిన షరతులకు ఒప్పుకోవాల్సి వస్తోంది. మరోవైపు మా అసోషియేషన్ ఎన్నికల్లో ఏపీలో ప్రత్యేక ఇండస్ట్రీ నెలకొల్పాలన్న డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలకు పెద్ద సమస్యేవచ్చి పడింది. మరి చివరికి ఏపీ సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.