వార్షిక జాబ్ క్యాలెండర్: నిరుద్యోగులకు కేసీఆర్ వరాలు

ఎట్టకేలకు ప్రభుత్వంలో చలనం వచ్చింది. నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించింది. నిరుద్యోగుల కలలను నిజం చేసే జాబ్ క్యాలెండర్ విడుదలకు నిర్ణయించింది. దీంతో ప్రతి సంవత్సరం రాష్టంలో ఉద్యోగాల భర్తీపై దృష్టి సారిస్తామని చెప్పింది. దీంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో తెలంగాణ కేబినెట్ మరో అడుగు వేసింది. ఇకపై ఉద్యోగ నియామకాలకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన […]

Written By: Srinivas, Updated On : July 14, 2021 10:52 am
Follow us on

ఎట్టకేలకు ప్రభుత్వంలో చలనం వచ్చింది. నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించింది. నిరుద్యోగుల కలలను నిజం చేసే జాబ్ క్యాలెండర్ విడుదలకు నిర్ణయించింది. దీంతో ప్రతి సంవత్సరం రాష్టంలో ఉద్యోగాల భర్తీపై దృష్టి సారిస్తామని చెప్పింది. దీంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో తెలంగాణ కేబినెట్ మరో అడుగు వేసింది. ఇకపై ఉద్యోగ నియామకాలకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యోగ నియామకాల కోసం ఏటా వార్షిక క్యాలెండర్ తయారీకి కేబినెట్ ఆమోదం తెలపింది. రాష్ర్టంలో ఏఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించి తరువాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం వార్షిక క్యాలెండర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. భర్తీ ప్రక్రియపై బుధవారం మంత్రివర్గం చర్చించనుంది. దీంతో ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్తే.

కొత్త జోనల్ వ్యవస్థకుఅనుగుణంా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు చేపట్టనున్నారు. నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని కేబినెట్ ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపులపై టీఎన్జీవో, టీజీవో విన్నపంపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఉధ్యోగ సంఘాల కోరికమేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే చేపట్టేలా చర్యలు తీసుకుంది ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ త్వరితగతిన జరగాలని అధికారులను ఆదేశించింది.

పల్లెప్రగతి. పట్టణ ప్రగతిపై ప్రభుత్వం దృష్టి సారించింది. గురుకుల పాఠశాలల్లో స్థానిక రిజర్వేషన్లకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయా నియోజకవర్గాల విద్యార్థులకు50 శాతం సీట్లు కేటాయించాలని భావించింది. నెలలోపు వైకుంఠ ధామాల పనులు పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధిదీపాల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించింది.

హైదరాబాద్ శివారు పురపాలికల్లో నీటి సమస్యపై ప్రధానంగా చర్చ జరిగింది. తక్షణమే నీటి సమస్య కోసం రూ.1200 కోట్లు సీఎం మంజూరు చేశారు. నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక లే అవుట్లు అభివృద్ధి చేయాలని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి తక్షణమే తీర్చేలా అధికారులు జాగ్రత్తగా పని చేయాలని ఆదేశించారు. ఎక్కడ కూడా సమస్యలు కనిపించవద్దని సూచించారు.