
మొత్తం దేశం అంతా కరోనా కట్టడికోసం తలమునకలై ఉండగా, మహారాష్ట్రాలో లాక్ డౌన్ నిబంధనలను గాలికి వదిలేసి వివాదాస్పదమైన ఒక పెద్ద పారిశ్రామిక వేత్తను విహారయాత్రకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఇచ్చిన పాస్ తో వెళ్లడం పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ విషయమై అదనపు డిజిపి హోదాలో ఉన్న అధికారి అమితాబ్ గుప్తా సస్పెన్షన్ కు గురికావడం తెలిసిందే.
నగర పోలీస్ కమీషనర్ ఇవ్వవలసిన అనుమతి పాస్ ను హోమ్ శాఖల ప్రిన్సిపాల్ కార్యదర్శిగా ఉన్న అధికారి ఏ విధంగా ఇచ్చారనే ప్రశంలు ముందు తలెత్తాయి. హోమ్ మంత్రి కూడా ఈ విషయం తనకు తెలియదని అనడంతో ప్రభుత్వంలో ప్రముఖులు ఎవ్వరో చెప్పనదే ఆ అధికారి ఆ విధంగా పాస్ ఇచ్చి ఉండరని ప్రతిపక్షం బిజెపి నేతలు విమర్శలు గుప్పించారు.
దేశమంతా లాక్‌డౌన్ ఉండగా డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధవాన్స్ లు 200 కిమీ కు పైగా స్వేచ్చగా ప్రయాణించేందుకు పాస్ జరీ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. కాగా, ఇప్పుడు వారికి సహకరించింది బిజెపి నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ని శివసేన ఇప్పుడు ఎదురు దాడి చేయడంతో రాజకీయ వివాదం ఒక దుమారంగా మారింది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్ సంస్థలో అక్రమ లావాదేవీల ఆరోపణలు ఎదుర్కొంటున్న వాధవాన్ సోదరులు దర్యాప్తు అధికారులు అరెస్టు చేస్తారేమోనన్న భయంతో ముంబై నుంచి ఖంబాలా పారిపోయారు. వారితోపాటు 21 మంది కుటుంబసభ్యులు, పనివాళ్లు కూడా కంభాలా వెళ్లేందుకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి అమితాబ్‌గుప్త అనుమతి పత్రం జారీచేశారు.
దీనిపై ప్రతిపక్షాల విమర్శలను శివసేన అధికార పత్రిక సామ్నా సోమవారం తిప్పికొట్టింది. అమితాబ్ గుప్తను ఆ పదివిలో నియమించినది గత ముఖ్యమంత్రేనని, దాంతోనే వాధవాన్ సోదరుల వెనుక ఎవరున్నారో తెలుస్తున్నని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై విమర్శలు గుప్పించింది. వాధవాన్స్‌కు ప్రయాణ అనుమతి ఇవ్వటం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించింది
దేశం మొత్తం మీద అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు 2,000 కు పైగా మహారాష్ట్రాలో ఉన్న సమయంలో రాజకీయ దుమారంలో రాజకీయ నేతలు చిక్కుకోవడం గమనార్హం.