ఉక్కు ఉద్యమం నుంచి వైసీపీ తప్పుకున్నట్లేనా..? బంద్‌కు మద్దతు లేనట్లేనా..?

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ఇప్పటికే డిసైడ్‌ చేసింది. దీంతో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉద్యమం నడుస్తోంది. ఇప్పుడు ఆ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తోంది. ఐదో తేదీన ఏపీ వ్యాప్తంగా బంద్ పాటించాలని నిర్ణయించారు. ఈ మేరకు వామపక్షాలు లీడ్ తీసుకుని రంగంలోకి దిగి ప్రచారం చేశాయి. రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. ఒక్క వైసీపీ మాత్రం బంద్ గురించి ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. Also Read: విశాఖకు […]

Written By: Srinivas, Updated On : March 4, 2021 2:09 pm
Follow us on


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ఇప్పటికే డిసైడ్‌ చేసింది. దీంతో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉద్యమం నడుస్తోంది. ఇప్పుడు ఆ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తోంది. ఐదో తేదీన ఏపీ వ్యాప్తంగా బంద్ పాటించాలని నిర్ణయించారు. ఈ మేరకు వామపక్షాలు లీడ్ తీసుకుని రంగంలోకి దిగి ప్రచారం చేశాయి. రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. ఒక్క వైసీపీ మాత్రం బంద్ గురించి ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు.

Also Read: విశాఖకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ షిఫ్ట్‌

కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ సమావేశమైనప్పుడు.. వారి ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్లుగా చెప్పారు. అయితే.. బంద్ గురించి మాత్రం ప్రస్తుతం ఆ పార్టీ నేతలెవరూ మాట్లాడటం లేదు. విశాఖపట్నాన్ని గుత్తకు తీసుకుని రాజకీయం చేస్తున్న విజయసాయిరెడ్డి బంద్‌కు మద్దతు విషయంలో ఎటూ తేల్చడం లేదు. తమ పార్టీ అనుకూలమని ఆయన చెప్పడం లేదు. ఉద్యమం ప్రారంభమైన మొదట్లో వామపక్షాలతో కలిసి నడుస్తామని మాత్రమే ఆయన ప్రకటించారు.

కానీ.. ఇప్పుడు మాత్రం నోరు మెదపడం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ మరోవైపు కేంద్రం చెబుతోంది. కేంద్రం మాటలను జవదాటే పరిస్థితిలో ఏపీ సర్కార్ లేదు. ప్రైవేటీకరణ వద్దని ఓ లేఖ రాసినప్పటికీ.. దాని గురించి పెద్దగా ఒత్తిడి చేసే పరిస్థితి కూడా లేదు. అందుకే బీజేపీ నేతలు సైలెంట్ అయిపోయారు. వైసీపీ నేతలు కూడా అదే బాట ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. రాను రాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతుగా వారి వాయిస్ కూడా మారే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.

Also Read: జగన్ కూతుళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

మరోవైపు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో మొదట్లో కనిపించినంత వేడి ఇప్పుడు లేదు. ఆంధ్రుల హక్కు అన్న సెంటిమెంట్ ప్రారంభమైనప్పటికీ.. తర్వాత పార్టియాలిటీ వచ్చి చేరింది. అది ఉద్యోగుల కష్టం అనే భావనకు వచ్చారు. అమరావతి అంశం అక్కడి రైతులదే అన్నట్లుగా.. స్టీల్ ప్లాంట్ అక్కడి ఉద్యోగుల సమస్యే అన్నట్లుగా పరిస్థితిని మార్చేస్తున్నారు. దీంతో వైసీపీ కూడా స్ట్రాటజీ మార్చుకుంది. బంద్‌కు మద్దతివ్వడం కన్నా సైలెంట్‌గా ఉండటమే మంచిదని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్