Delhi Election Result : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈసారి మొత్తం 699 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలు నిక్షిప్తం చేసుకున్నాయి. అయితే గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. 2020లో 62.59% పోలింగ్ కాగా, 2025లో అది 60.44%గా నమోదైంది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ (58.64%)తో పోలిస్తే 1.8% ఎక్కువగా ఉంది.
ఢిల్లీ ఎన్నికల్లో ముస్లింలు ఏ పార్టీకి ఓటు వేయాలనే అంశంలో ఈసారి విభజన స్పష్టంగా కనిపించింది. గతంలో ముస్లిం ఓటు ఏకగ్రీవంగా ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (AAP) వైపే వెళ్ళింది. 2020 ఎన్నికల్లో 83% ముస్లింలు ఆప్ కి ఓటు వేశారని సీఎస్‌డీఎస్ విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే, 2025 ఎన్నికల్లో అదే పరిస్థితి కనిపించలేదు.
ముస్లిం ఓటు ఎవరికి పడింది ?
AIMIM : ఢిల్లీలో తొలి సారి AIMIM పోటీ చేయడంతో ముస్లిం ఓటు కొంత భాగం ఈ పార్టీకి వెళ్లింది.
కాంగ్రెస్: పాత ముస్లిం నేతలైన హారూన్ యూసుఫ్, అలీ మేహంది వంటి అభ్యర్థులకు కొంత మద్దతు లభించింది.
AAP: కొంతమంది ముస్లింలు మళ్లీ ఈ పార్టీకి మద్దతుగా నిలిచారు.
ముస్లిం ప్రాంతాల్లో అత్యధికంగా పోలింగ్
ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో సాధారణంగా పోలింగ్ శాతం ఎక్కువగా కనిపించింది.
ముస్తఫాబాద్ – 69%
సీలంపూర్ – 68.7%
గోకల్పురి – 68.3%
బాబర్పూర్ – 66%
కరవాల్ నగర్ – 64.44%
సీమాపురి – 65.3%
అయితే, ఇదే సమయంలో కొన్ని ఇతర ముస్లిం ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది.
తక్కువ ఓటింగ్ నమోదైన నియోజకవర్గాలు:
ఓఖ్లా – 54.90%
చాంద్ని చౌక్ – 55.96%
మహరౌలి – 53%
ముస్లిం ఓటు ఎందుకు విభజన జరిగింది.
* తబ్లీగీ జమాత్ వివాదం – కోవిడ్ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తబ్లీగీ జమాత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న భావన ముస్లింలో ఉంది.
* కేజ్రివాల్ ‘సాఫ్ట్ హిందుత్వ’ విధానం – హనుమాన్ చాలీసా పఠనం, అయోధ్య యాత్రలపై దృష్టి పెడుతూ ముస్లింలకు దూరమయ్యారు.
* ఢిల్లీ మత ఘర్షణలపై AAP సైలెంట్ – 2020లో ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల్లో ఆప్ ముస్లింలకు సహకరించలేదన్న భావన ఉంది.
ఈ విభజన ఎవరికి లాభం
ముస్లింల ఓటింగ్ విభజన వల్ల బీజేపీకి ప్రయోజనం కలిగే అవకాశముంది. ముస్లింల ఓట్లు AAP, AIMIM, కాంగ్రెస్ మధ్య విభజన కావడం వల్ల బీజేపీకి బలం పెరిగే అవకాశం ఉంది. హిందూ ఓటింగ్ ఎక్కువ శాతం బీజేపీకే వెళ్లింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తరువాత తుది ఫలితాలు ఏ రీతిలో ఉంటాయోనని ఆసక్తిగా మారింది. ముస్లింల ఓటింగ్ ధోరణి, ఇతర సామాజిక వర్గాల ప్రభావం ఆప్ భవితవ్యాన్ని ఎలా నిర్ణయిస్తాయో వేచిచూడాలి.