Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించడమే కాకుండా సినిమాల మీద ఆయనకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో చెప్పకనే చెబుతూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటూ ఉండటం విశేషం… రణబీర్ కపూర్ (Ranbeer Kapoor) లాంటి స్టార్ హీరోతో అనిమల్ (Animal) సినిమా చేసి 900 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. అలాగే రన్బీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించిన సినిమాగా కూడా ఆ సినిమా నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన ఇంటర్వ్యూలో తను డైరెక్టర్ కాకముందు చాలా ఫ్రీగా ఉండేవాడినని సినిమా రిఫరెన్స్ ల కోసం మ్యూజిక్ ల కోసం అన్ని భాషల్లో ఉన్న సినిమాలను చూస్తూ టెక్నీషియన్స్ ఎవరు బాగా చేశారు. అనేదాని మీద బాగా అబ్జర్వ్ చేసే వాడిని ఇప్పుడు డైరెక్టర్ అయిన తర్వాత చాలా తక్కువ సినిమాలు చూస్తున్నాను.
ఆరు సంవత్సరాల్లో కేవలం 60 సినిమాలు మాత్రమే చూసాను అంటూ ఆయన చెబుతూ ఉండడం అభిమానులను కొంతవరకు నిరాశ పరుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ అసంతృప్తిగా ఉన్నాడు అంటే తన అభిమానులు కూడా కొంతవరకు నిరాశను వ్యక్తం చేసే అవకాశమైతే ఉంది.
కాబట్టి ఇలాంటి సందర్భంలో సందీప్ రెడ్డివంగా ఒకప్పటి రోజులే బాగున్నాయి. అప్పుడు నచ్చిన సినిమాలు చూస్తూ మనం ఎలాంటి సినిమా చేయాలి అనే దానిమీద ఎక్కువగా కసరత్తులు చేస్తూ ఉండేవాణ్ణి…కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు అంటూ ఆయన కొంత వరకు అసహనాన్ని వ్యక్తం చేయడం అనేది ఒక రకంగా బ్యాడ్ విషయమనే చెప్పాలి.
మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ట్ డైరెక్టర్ ఇప్పటికే ఇండియాలో ఉన్న టాప్ 5 డైరెక్టర్లలో ఒకడిగా నిలిచిపోయాడు. కాబట్టి అతను రాబోయే రోజుల్లో కూడా పాన్ వరల్డ్ సినిమా రేంజ్ లో సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే తీవ్రమైన కసరత్తులు కూడా చేస్తున్నాడు…చూడాలి మరి ఆయన ఇక మీదట ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు తద్వారా ఆయన రేంజ్ ఎలా మారబోతోంది అనేది…