Vote Chori Allegation: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనదేశంలో ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎన్నికల సంఘానికి అప్పగించింది రాజ్యాంగం.. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు మనదేశంలో ఎన్నో సందర్భాలలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహించింది. మన ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే సమయంలో తప్ప ఇంతవరకు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టింది లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వరుసగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం పెట్టాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ లేవనెత్తిన సమస్యలకు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది.
వాస్తవానికి ఓటర్ల జాబితా రూపొందించినప్పుడు రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. ఎన్నికల సంఘం కేవలం అధికారుల స్థాయిలోనే సమాధానాలు చెబుతుంది. అవసరమైతే వివరణలు కూడా ఇస్తుంది. అయితే ఎప్పుడు కూడా కేంద్రాన్నికల సంఘం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు రాలేదు. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు తారాస్థాయి దాటుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రంగంలోకి దిగక తప్పలేదు. అంతేకాదు తన ప్రతిష్టను కాపాడుకునేందుకు ఏకంగా ఎన్నికల సంఘం ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నట్టు కనిపిస్తోంది.
గత ఎడల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి మెరుగైన స్థానాలు సాధించింది. బిజెపికి బంపర్ మెజారిటీ దక్కకుండా అడ్డుకున్నది. అయితే ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో ఇండియా కూటమికి అనుకూల ఫలితం రాలేదు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందనుకున్నప్పటికీ ఫలితం వేరే విధంగా వచ్చింది. మహారాష్ట్రలో కూడా ఊహించని ఫలితం వచ్చింది. దీనిని ఇండియా కూటమి తీవ్రంగా పరిగణించింది. ఓట్ల శాతం లో తేడా జరిగిందని ఇండియా కూటమి ఆరోపించుకుంటూ వచ్చింది. ప్రస్తుతం బీహార్లో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు సంబంధించి సవరణ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇక అప్పటినుంచి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లైన్లోకి వచ్చింది. మహారాష్ట్రలో జరిగింది బీహార్ లోనూ చోటు చేసుకుంటుందని అనుమానం వ్యక్తం చేయడం మొదలుపెట్టింది.
Also Read: బెంగళూరులో ఆపిల్ ఆఫీస్ రెంట్ రూ.1000 కోట్లు.. ఊహించని పెట్టుబడి!
రాహుల్ గాంధీ ఏకంగా గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గం లో భారీగా ఓట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఏకంగా ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.. ఎన్నికల సంఘం రూపొందించిన జాబితాలో చనిపోయిన ఓటర్లతో ఆయన కలిసి భోజనం చేశారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. అంతేకాదు భారత జనతా పార్టీతో ఎన్నికల సంఘం కుమ్మక్కైందని ఆరోపించారు. ఓకే ఇంటి నెంబర్ మీద వందల సంఖ్యలో ఓట్లు ఉండటం.. గుర్తింపు కార్డుల మీద ఫోటోలు సరిగ్గా లేకపోవడం.. ఓకే ఓటర్ పేరు అనేకమార్లు నమోదు కావడం.. అనేక రాష్ట్రాల జాబితాలోను అదే వ్యక్తి పేరు ఉండడం.. కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి ఉద్దేశించిన ఫారం -6 దుర్వినియోగం కావడం వంటి విషయాలను రాహుల్ ప్రస్తావించారు. డిజిటల్ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చేందుకు వెనుకడడాన్ని రాహుల్ గాంధీ తప్పు పట్టారు. మరో అడుగు ముందుకేసి బీహార్ రాష్ట్రంలో ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర బీహార్ రాష్ట్రంలో 20 జిల్లాల మీదుగా 16 రోజులపాటు జరుగుతుంది. 1300 కిలోమీటర్ల మేర సాగుతుంది. పాట్నాలో సెప్టెంబర్ ఒకటిన ముగుస్తుంది.
రాహుల్ అడిగిన అనేక ప్రశ్నలకు ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వలేదు. పైగా ఆఫిడవిట్ సమర్పించాలని . అంతేకాదు ఎన్నికల వీడియో ఫుటేజ్ కూడా ఇవ్వడానికి ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు. సహజంగానే ఇవి కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలుగా మారాయి. ఇవే విషయాలను పదేపదే ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ బీహార్ లో ప్రచారం చేస్తున్నారు. మరి దీనిపై ఎన్నికల సంఘం ఏవిధంగా స్పందిస్తుంది.. కేంద్ర ప్రభుత్వం ఎలా సమస్యను పరిష్కరిస్తుంది.. అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.