Homeజాతీయ వార్తలుApple Bengaluru Lease Deal: బెంగళూరులో ఆపిల్ ఆఫీస్ రెంట్ రూ.1000 కోట్లు.. ఊహించని పెట్టుబడి!

Apple Bengaluru Lease Deal: బెంగళూరులో ఆపిల్ ఆఫీస్ రెంట్ రూ.1000 కోట్లు.. ఊహించని పెట్టుబడి!

Apple Bengaluru Lease Deal: ఆపిల్, ప్రపంచంలోని అతిపెద్ద టెక్‌ దిగ్గజాల్లో ఒకటి, భారతదేశంలో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించింది. తాజాగా భారత మార్కెట్‌ను మరింత సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసింది. భారీగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరులో 2.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కార్యాలయ స్థలాన్ని పదేళ్ల లీజు ఒప్పందంతో సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ విలేవే రూ.1,000 కోట్లకు పైగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యాలయం తొమ్మిది అంతస్తుల్లో విస్తరించి ఉండి, పార్కింగ్, ఇతర సౌకర్యాలను కలిగి ఉంది. నెలకు రూ.6 కోట్ల రెంట్‌తో, ఇది భారతదేశంలో అతిపెద్ద కార్యాలయ లీజు ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది. ఈ లీజు ఒప్పందం ఆపిల్‌ భారత్‌పై దీర్ఘకాలిక నిబద్ధతను సూచిస్తుంది. 2.7 లక్షల చదరపు అడుగుల స్థలం కోసం రూ. 1,000 కోట్ల విలువైన పదేళ్ల ఒప్పందం అనేది ఒక సాధారణ రియల్‌ ఎస్టేట్‌ ఒప్పందం కాదు. నెలవారీ రూ. 6 కోట్ల రెంట్, సంవత్సరానికి నిర్దిష్ట శాతం పెరుగుదలతో, ఈ ఒప్పందం ఆర్థిక దృష్ట్యా భారీగా ఉందని చెప్పవచ్చు.

Also Read: ట్రంప్ హెచ్చరించినా సరే.. ఆపిల్ గమ్యస్థానం ఇండియానే.. తాజాగా ఏం జరుగుతోందంటే?

ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డీ హబ్‌గా భారత్‌..
ఈ కొత్త కార్యాలయం ఆపిల్‌ యొక్క ఇంజనీరింగ్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఆర్‌అండ్‌డీ), సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ బృందాలకు స్థలం కల్పిస్తుంది. బెంగళూరు, భారతదేశ టెక్‌ రాజధానిగా పిలవబడే నగరం, దాని నైపుణ్యం కలిగిన టెక్‌ ప్రొఫెషనల్స్, ఆవిష్కరణలకు కేంద్రంగా ఉండటం వల్ల ఆపిల్‌ ఈ నగరాన్ని ఎంచుకుంది. ఈ కార్యాలయం ఆపిల్‌ ఉత్పత్తుల అభివృద్ధి, ముఖ్యంగా ఐఫోన్, ఇతర టెక్‌ సొల్యూషన్స్‌కు సంబంధించిన పరిశోధనలను మరింత వేగవంతం చేస్తుంది. ఇది స్థానిక ఉద్యోగులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది, దీనివల్ల బెంగళూరు, భారతదేశంలోని టెక్‌ రంగం మరింత బలోపేతమవుతుంది.

ఎగుమతిలో ఆధిపత్యం
ఆపిల్‌ ఇప్పటికే భారతదేశం నుంచి ఐఫోన్‌ల ఎగుమతిలో అగ్రగామిగా ఉంది. ఈ కొత్త కార్యాలయం ద్వారా, ఆపిల్‌ తన ఉత్పాదన, ఎగుమతి సామర్థ్యాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోని తయారీ కేంద్రాల నుంచి ఐఫోన్‌లను ప్రపంచ మార్కెట్‌లకు ఎగుమతి చేయడం ద్వారా, ఆపిల్‌ భారత ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందిస్తోంది. ఈ కార్యాలయం ద్వారా స్థానిక ఉత్పాదన, ఆవిష్కరణలు, ఎగుమతులు మరింత ఊపందుకుంటాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

Also Read:  యాపిల్‌తో చేతులు కలిపిన అమెరికా కంపెనీ.. చైనా ఆధిపత్యానికి చెక్ పడినట్లేనా ?

ఈ ఒప్పందం బెంగళూరు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు మాత్రమే కాక, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక వరంగా ఉంటుంది. కొత్త కార్యాలయం వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది, ముఖ్యంగా టెక్, ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డీ రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు. ఇది స్థానిక వ్యాపారాలకు, సర్వీస్‌ ప్రొవైడర్లకు, సప్లై చైన్‌లకు కూడా పరోక్షంగా లాభం చేకూరుస్తుంది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా‘ కార్యక్రమానికి మరింత ఊతం ఇస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular