https://oktelugu.com/

ప్రధానికి లేఖతో బాబు అబాసు పాలయ్యారా?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన ప్రతిపక్షనేత చంద్రబాబు తానే ఇరకాటంలో పడ్డారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి బాబు లేఖ రాశారు. ఈ లేఖలో ముందుగా ప్రధాని ఘనతను గొప్పగా చెప్పిన చంద్రబాబు అనంతరం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఈ వ్యవహారం కాలరాస్తుందని ట్యాపింగ్ పై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఈ లేఖ బీజేపీ నాయకులకు అస్త్రంగా మారింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 18, 2020 2:46 pm
    Follow us on


    ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన ప్రతిపక్షనేత చంద్రబాబు తానే ఇరకాటంలో పడ్డారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి బాబు లేఖ రాశారు. ఈ లేఖలో ముందుగా ప్రధాని ఘనతను గొప్పగా చెప్పిన చంద్రబాబు అనంతరం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఈ వ్యవహారం కాలరాస్తుందని ట్యాపింగ్ పై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఈ లేఖ బీజేపీ నాయకులకు అస్త్రంగా మారింది.

    Also Read: ఫోన్ ట్యాపింగ్: చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన జగన్

    టీడీపీ, బీజేపీ రెండు పార్టీలు 2014 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. మంత్రివర్గంలోను రెండు పార్టీలు భాగం పంచుకున్నాయి. తాను గొప్ప రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నానని భావించిన బాబు… మూడేళ్ల అనంతరం బీజేపీతో తెగతెంపులు చేసుకుని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలకు బీజేపీని శత్రువుగా చూపుతూ ప్రధాని, బీజేపీపై కీలకమైన వ్యాఖ్యలు మీడియా సమావేశాల్లో చేశారు. ఒక సందర్భంగా ప్రధాని కుటుంబం లేదని, ఆయన భార్యను వదిలేశాడని వ్యక్తిగత విమర్శలు చేశారు.

    Also Read: కారులో ముగ్గురు ఉండగానే తగలబెట్టేశాడు… విజయవాడలో దారుణం!

    దీంతో ఇప్పడు బీజేపీ రాష్ట్ర ఉఫాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. 2018 నుంచి 2019 మే వరకూ చంద్రబాబు ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. అవేంటంటే ‘‘నీకు కుటుంబం, బంధాలు లేవు, మా హక్కులు కాలరాశారు. మా అభివృద్దిని చూసి ఓర్వలేకపోతున్నారు. నీ కంటే నేనే ముందు సీఎం అయ్యాను, గుజరాత్ ని ఏం అభివృద్ది చేశావు? మీ రాష్ట్రం కంటే దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. మీకు మేము బానిసలం కాదు. మీరు పని చేసే పిఎం కాదు, మాకు పని చేసే ప్రధాని కావాలి’’ ఈ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తడం అవకాశవాదానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రధాని మోడీకి, బీజేపీకి మతిమరుపు లేదని ట్విట్ చేశారు. ట్యాపింగ్ పై ప్రధానికి లేఖ రాసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన బాబును బీజేపీ ఎండగట్టేస్తుంది.