https://oktelugu.com/

ప్రమాదానికి కారణమదేనా…?

విశాఖ దుర్ఘటనకు నిర్లక్షమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది మార్చి 25 నుంచి పరిశ్రమను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది రసాయన పరిశ్రమ కావడంతో నిరంతర పర్యవేక్షణ అవసరం ఉంది. లాక్ డౌన్ సమయంలో అన్ని అనుమతులు మంజూరు చేసిన సక్రమ నిర్వహణ లేనికారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలో భారీ ప్రమాదం…! లాక్‌డౌన్‌ ఉన్నకారణంగా మెయింటెనెన్స్‌ కోసం ప్రభుత్వం పాస్‌లు కూడా ఇచ్చింది. 45 మందికి మెయింటెనెన్స్‌ పాస్‌లు ఇచ్చినప్పటికీ యాజమాన్యం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 7, 2020 / 04:31 PM IST
    Follow us on


    విశాఖ దుర్ఘటనకు నిర్లక్షమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది మార్చి 25 నుంచి పరిశ్రమను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది రసాయన పరిశ్రమ కావడంతో నిరంతర పర్యవేక్షణ అవసరం ఉంది. లాక్ డౌన్ సమయంలో అన్ని అనుమతులు మంజూరు చేసిన సక్రమ నిర్వహణ లేనికారణంగా ప్రమాదం చోటు చేసుకుంది.

    విశాఖలో భారీ ప్రమాదం…!

    లాక్‌డౌన్‌ ఉన్నకారణంగా మెయింటెనెన్స్‌ కోసం ప్రభుత్వం పాస్‌లు కూడా ఇచ్చింది. 45 మందికి మెయింటెనెన్స్‌ పాస్‌లు ఇచ్చినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గురువారం రాత్రి పరిశ్రమను పునఃప్రారంభించడానికి యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం చోటుచేసుకుంది.

    వైజాగ్ ఘటనపై కేటీఆర్ దిగ్భ్రాంతి!

    పరిశ్రమ ట్యాంకుల్లో దాదాపు 2 వేల మెట్రిక్‌ టన్నుల స్టైరెన్‌ను నిల్వ చేసింది. అక్కడ 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంచడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో స్టైరెన్‌ లీక్‌ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెన్‌ గ్యాస్‌ వేగంగా వ్యాప్తి చెందింది. రెండ సారి స్టైరెన్‌ గ్యాస్ వెలువడటంతో చుట్టుపక్కల ప్రాంతాల వారిని తరలించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది. పరిస్థితి చక్కబడే వరకూ ఎవరు ఈ ప్రాంతానికి తిరిగి రావద్దని పరిశ్రమ నిర్వాహకులు ప్రకటించారు.