యాజమాన్యం నిర్లక్ష్యంతోనే గ్యాస్ లీక్: బీజేపీ

యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణం చేతనే విశాఖలో గ్యాస్ లీకేజి జరిగిందని బీజేపీ నేత, మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో భారీ ప్రమాదం…! ఈ సందర్భంగా తమ తప్పిదాన్ని కప్పి పుచ్చుకునేందుకు యాజమాన్యం చేస్తున్న వాదనలను రాజు కొట్టిపారేసారు. యాజమాన్యం వైపు నుంచి కొంతమంది మాట్లాడుతూ.. కెమికల్ స్టోర్ చేశామని, 45 రోజులు దాటిందని, […]

Written By: Neelambaram, Updated On : May 7, 2020 4:39 pm
Follow us on


యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణం చేతనే విశాఖలో గ్యాస్ లీకేజి జరిగిందని బీజేపీ నేత, మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విశాఖలో భారీ ప్రమాదం…!

ఈ సందర్భంగా తమ తప్పిదాన్ని కప్పి పుచ్చుకునేందుకు యాజమాన్యం చేస్తున్న వాదనలను రాజు కొట్టిపారేసారు. యాజమాన్యం వైపు నుంచి కొంతమంది మాట్లాడుతూ.. కెమికల్ స్టోర్ చేశామని, 45 రోజులు దాటిందని, రియాక్షన్స్ ఉంటాయని, కంపెనీ తెరవటానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్పడం విస్మయం వ్యక్తం చేశారు.

యాజమాన్యం చేస్తున్న వాదన వాస్తవమా? కాదా? అన్నదానిపై విచారణ చేయాలని విష్ణుకుమార్ రాజు కోరారు. 45 రోజుల తర్వాత కెమికల్ రియాక్ట్ అయి గ్యాస్ రూపంలో బయటకు వచ్చే పరిస్థితి ఉందని ఇంజనీర్లు చెప్పినప్పుడు ప్రభుత్వం వెంటనే కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళాలి గదా అని విస్మయం వ్యక్తం చేశారు.

వైజాగ్ ఘటనపై కేటీఆర్ దిగ్భ్రాంతి!

కనీసం మీడియా దృష్టికైనా ఈ అంశాన్ని తీసుకువెళ్లి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పాలి గదా అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

మరోవంక, డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రాంతంలో సందర్శించడానికి అనుమతి ఇప్పించాలని కోరారు. బీజేపీ తరపున ఆ స్థలాన్ని సందర్శించి బాధితులను కలవాలనుకుంటున్నానని కన్నా వెల్లడించారు. కాబట్టి విశాఖపట్టణం, గుంటూరుకు తన ప్రయాణానికి అనుమతి ఇవ్వమని డీజీపీ సవాంగ్‌ను కన్నా లేఖలో కోరారు.