మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా!

విశాఖపట్నం గ్యాస్‌ లీకేజీ వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ ఘటనలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వనున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌ మీద ఉన్నవాళ్లకు రూ. 10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష, ప్రాథమిక చికిత్స పొందిన వారికి రూ. 25 వేలు నష్టపరిహారంగా అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఒక్కో జంతువుకు రూ. 25 వేలు నష్టపరిహారం […]

Written By: Neelambaram, Updated On : May 7, 2020 6:15 pm
Follow us on

విశాఖపట్నం గ్యాస్‌ లీకేజీ వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ ఘటనలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వనున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌ మీద ఉన్నవాళ్లకు రూ. 10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష, ప్రాథమిక చికిత్స పొందిన వారికి రూ. 25 వేలు నష్టపరిహారంగా అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఒక్కో జంతువుకు రూ. 25 వేలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. బాధిత గ్రామాల్లోని 15 వేల మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున అందిస్తామన్నారు. బాధిత కుటుంబాలకు  ఎల్‌జీ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మంత్రి కన్నబాబు సహా మరికొందరు మంత్రులు ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలిపారు.

ఘటన జరిగాక వెంటనే స్పందించిన అధికారులకు సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు. ఉదయం 4.30 గంటలకే కలెక్టర్‌, డీసీపీ చేరుకుని ప్రమాద స్థలంలో సహాయ చర్యలు చేపట్టారన్నారు. 340 మందికి పైగా స్థానికులను ఆస్పత్రులకు తరలించారని.. వందల సంఖ్యలో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం పేర్కొన్నారు. లీకైన గ్యాస్‌ ప్రభావం కొన్ని రోజులపాటు ఉంటుందన్నారు. వెంకటాపురం, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరి నగర్‌, పద్మనాభపురంలో ఈ ప్రభావం కనిపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే కంపెనీని అక్కడి నుంచి తరలిస్తామని పేర్కొన్నారు.