మెగా స్టార్ చిరంజీవి ఎమోషనల్ అయిపోయారు. కరోనా సెకండ్ వేవ్ ను చూసి.. ప్రజలు పడుతున్న బాధలు.. చనిపోతున్న వారిని తలుచుకొని బాధపడ్డారు. తాజాగా చిరంజీవి కరోనా పరిస్థితులపై ఒక వీడియోను విడుదల చేశారు. అందరి హృదయాల్ని బరువెక్కించేలా ఉంది.
కరోనా సెకండ్ వేవ్ లో ఎంతో మంది ఆత్మీయులను, స్నేహితులను కబళిస్తోందని.. ఎంతోమందికి ఆవేదన మిగులుస్తోందని చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వీలుంటేనే బయటకు రావాలని.. డబుల్ మాస్క్ పెట్టుకోవాలని.. కరోనా అని తెలియగానే కంగారు పడకుండా జాగ్రత్తలు పాటించాలని చిరంజీవి సూచించారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకండి అని చిరంజీవి చేతులు జోడించి వేడుకున్నారు. మన ఆత్మీయులను కోల్పోవడం చూస్తుంటే గుండె బరువెక్కిపోతోందని చిరంజీవి అన్నారు.
కరోనా ఇంట్లోనే ఉండి తగ్గించుకోండని.. ఏదైనా సమస్య వస్తేనే ఆస్పత్రికి రండని.. కోలుకున్నాక ప్లాస్మా దానం చేసి ఈ విఫత్తు సమయంలో మరో ఇద్దరిని బతికించండని చిరంజీవి వేడుకున్నారు.
ఈ వీడియోను అందరూ షేర్ చేసి.. విపత్తు సమయంలో ఈ విషయాలు వీలైనంత మందికి చెప్పి మీ వంతు సాయం చేయండి ప్లీజ్ అని చిరంజీవి వేడుకుంటున్న వీడియో అందరి హృదయాలు కదిలించేలా ఉంది.