Viral Baba Abhay Singh : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు సంగమంలో స్నానమాచరించారు. దాదాపు ఒకటిన్నర నెలల పాటు జరిగే మహా కుంభమేళాలో పెద్ద సంఖ్యలో సాధువులు, బాబాలు పాల్గొంటారు. వారిలో ప్రస్తుతం ఓ బాబా చాలా వైరల్ అవుతున్నాడు. ఆయనే అభయ్ సింగ్, అతను సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఐఐటీ ముంబై నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభయ్ సింగ్ ఇప్పుడు ప్రాపంచిక ప్రలోభాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. బాబాగా మారడం ద్వారా జీవిత సత్యాన్ని తెలుసుకోవడం వైపు పయనిస్తున్నాను అంటున్నాడు. ‘ఇంజనీర్ బాబా’ వైరల్ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది చూస్తూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు ఓ కీలక విషయం చెప్పాడు. తాను సాధువుని లేదా సన్యాసిని కాదని, కానీ మోక్షాన్ని పొందే మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకిని తొలగించాలనుకుంటున్న అన్నాడు.
ఇప్పుడు అభయ్ సింగ్ స్వయంగా తన జీవిత కథను చెప్పాడు. అందులో తాను ఒకప్పుడు నిరాశకు ఎలా గురయ్యానో చెప్పాడు. ఆజ్ తక్ తో మాట్లాడుతూ.. అభయ్ సింగ్ ఐఐటీ ముంబైలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత తన భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందానని, తరువాత ఏమి చేయాలో తెలుసుకోవడానికి ప్రయత్నించానని చెప్పాడు. ఆ సమయంలోనే తీవ్ర నిరాశ నిస్పృహకు లోనయ్యాను అన్నారు. అతను ఇలా అన్నాడు, “నేను చాలా నిరాశకు గురయ్యాను, నాకు నిద్ర పట్టలేదు. మనసు అంటే ఏమిటో, నాకు నిద్ర ఎందుకు పట్టడం లేదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇవన్నీ తెలుసుకోవడానికి, నేను మనస్తత్వశాస్త్రం కూడా చదివాను. తరువాత, నేను ఇస్కాన్, శ్రీకృష్ణుడి గురించి కూడా తెలుసుకున్నాను.’’ అన్నారు
#WATCH | Prayagraj, UP: #MahaKumbh2025 | Baba Abhay Singh who is from Juna Akhada and was also an IIT student once, says, " I come from Haryana, I went to IIT, then changed to Arts from Engineering, that also didn't work so I kept changing and later I arrived at the final truth.… pic.twitter.com/Li6EwgCXbU
— ANI (@ANI) January 15, 2025
నేను సన్యాసిని కాదు
ప్రజలు తనను పిచ్చివాడిగా భావించడం ప్రారంభించారని ‘ఐఐటీ బాబా’ ఇంకా చెప్పారు. అయితే, అది తనకి ఎటువంటి బాధను కలిగించలేదన్నారు. అతను ఇలా అన్నాడు, “నేను చిన్నప్పుడు, ఇంటి నుండి పారిపోవాలని అనుకున్నాను. దీని వెనుక కారణం నేను నా కుటుంబంతో కలత చెందాను. అందుకే నేను IIT ముంబై నుండి ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నాను. అడ్మిషన్ పొందిన తర్వాత నేను ముంబై వెళ్ళాను. నేను సాధువు లేదా మహంత్‌ను కూడా కాదు. మోక్షాన్ని పొందడానికి ఒక సాధువు. దీని కోసం దారిలో వచ్చే ప్రతి కష్టాన్ని తొలగించాలి. నేను స్వేచ్ఛగా ఉన్నాను, నేను ఏదైనా చేయగలను.’’ అన్నారు.
ఐఐటీ ముంబై నుండి ఏరోస్పేస్ డిగ్రీ పొందిన అభయ్ సింగ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 45 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అభయ్ హర్యానాలోని ఝజ్జర్ జిల్లా నివాసి. అతను మొదటి ప్రయత్నంలోనే IIT ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణుడయ్యాడు.