China borders: సరిహద్దుల్లో ఖాళీ అవుతున్న గ్రామాలు.. ఎందుకంటే?

China borders: చైనా-భారత్ మధ్య తరుచూ సరిహద్దు వివాదాలు నెలకొంటూనే ఉన్నాయి. శాంతియుతంగా ఉండే భారత్ ను చైనా కవ్విస్తూ సామ్రాజ్య విస్తరణ కాంక్షను నిత్యం చాటుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల గాల్వానా లోయలో ఘర్షణలకు చైనా పాల్పడింది. ఈ ఘటనలో ఇరుదేశాల సైనికులు మృతిచెందగా చైనా తీరును భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈక్రమంలోనే చైనా-భారత్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ చైనా తీరులో పెద్దగా మార్పురావడం లేదు. కొన్ని నెలలుగా భారత […]

Written By: NARESH, Updated On : December 14, 2021 10:53 am
Follow us on

China borders: చైనా-భారత్ మధ్య తరుచూ సరిహద్దు వివాదాలు నెలకొంటూనే ఉన్నాయి. శాంతియుతంగా ఉండే భారత్ ను చైనా కవ్విస్తూ సామ్రాజ్య విస్తరణ కాంక్షను నిత్యం చాటుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల గాల్వానా లోయలో ఘర్షణలకు చైనా పాల్పడింది. ఈ ఘటనలో ఇరుదేశాల సైనికులు మృతిచెందగా చైనా తీరును భారత్ తీవ్రంగా తప్పుబట్టింది.

China borders

ఈక్రమంలోనే చైనా-భారత్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ చైనా తీరులో పెద్దగా మార్పురావడం లేదు. కొన్ని నెలలుగా భారత సరిహద్దుల సమీపంలో చైనా కొత్త గ్రామాలను నిర్మిస్తూ ప్రజలను అక్కడి తరలిస్తుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇదే సమయంలో భారత్-నేపాల్ సరిహద్దుల్లోని గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. సరిహద్దులను విడిచి ప్రజలు వలస వెళుతుండటం ఆందోళనను రేపుతోంది.

ఉత్తరాఖండ్ లోని పిథోరాగడ్ జిల్లాలో చైనా-నేపాల్ సరిహద్దుల్లోని 59గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయినట్లు సమాచారం. ఏ గ్రామం చూసినా నిర్మానుష్యంగానే కన్పిస్తున్నాయి. జల్ జీవన్ మిషన్ తాజా నివేదిక ప్రకారం.. పిథోరాగడ్ జిల్లాల్లో ప్రస్తుతం 1,542 గ్రామాల్లోనే ప్రజలు ఉన్నారు. మూడేళ్ల క్రితం ఆ సంఖ్య 1,601గా ఉండేది.

తాజాగా 59గ్రామాలు పూర్తిగా ఖాళీ కావడంతో ఆ ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయని జల్ నిగమ్ అధికారి రంజిత్ ధర్మసత్తూ వెల్లడించారు. మైగ్రేషన్ కమిషన్ డేటాను పరిశీలిస్తే.. పిథోరాగడ్ జిల్లాల్లోని 41 గ్రామాల్లో దాదాపు 50శాతానికి పైగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.

Also Read: మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా, ఉక్రెయిన్లు ఆజ్యం పోస్తున్నాయా..?

గంగోలిహాట్ అభివృద్ధి బ్లాక్ లో 25, బేరినాగ్ బ్లాక్ లో 12 గ్రామాలు, కనాలిచినా, మూనాకోటే బ్లాకులో రెండు గ్రామాల్లో సగానికి పైగా ప్రజలు వసలు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 21ఏళ్లు గడుస్తున్నా సరిహద్దుల్లో మాత్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది.

గడిచిన రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు సరిహద్దు గ్రామాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయాలు ఖర్చు చేస్తున్నాయి. అయితే నేటికి ఆ ప్రాంతాలకు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు, ఆరోగ్యం, విద్య, ఉపాధి సదుపాయాలు కరువయ్యాయి. ఈ కారణాలతోనే ప్రజలంతా ఇతర ప్రాంతాలకు వలస బాటపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీని వెనుక చైనా కుట్ర ఏదైనా ఉందా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

Also Read: పడిన చోటే లేచేందుకు.. రంగంలోకి రాహుల్