విజయవాడ వాసులు మెట్రో భాగ్యం దక్కడం లేదు. డీపీఆర్ కు రూ. కోట్లు వెచ్చించారు. డీఎంఆర్ పీ రూ.70 కోట్ల వరకు తీసుకుని తప్పుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కాస్త ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ గా మారింది. విజయవాడ కార్యాలయం విశాఖ ఎగిరిపోయింది. ఇక్కడ పేరుకు ప్రధాన కార్యాలయం ఉన్న నామమాత్రంగా మారింది. ఏడాది విజయవాడలో ఏ కార్యక్రమం జరగడం లేదు. దీంతో కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఎన్ పీ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు.
పలు మలుపులు తిరిగిన విజయవాడ మెట్రో ప్రస్తుత మరుగున పడింది. తేలికపాటి మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం ఆమోదించింది. దీని బాధ్యతలు సిస్ర్టా-రైట్స్ సంస్థకు అప్పగించారు. 2019 ఏప్రిల్ లో పూర్తిస్థాయి డీపీఆర్ అందించారు. విజయవాడ,అమరావతి కలిపి 85 కిలోమీటర్ల దూరం లైట్ మెట్రో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనికిగాను సుమారు రూ. 17,500 కోట్లు ఖర్చు కానుందని అంచనా వేశారు. తొలిదశలో విజయవాడ నగరంలో 38.5 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయాలని డీపీఆర్ లో ప్రతిపాదించారు.
మెట్రో ఆవశ్యకత ఉందని గుర్తించిన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై అధ్యయనం కోసం నాటి మంత్రి పి.నారాయణ నేతృత్వంలో ఒక కమిటీని విదేశాలకు పంపించి. పలు రకాల ప్రాజెక్టులను పరిశీలించిన బృందం తేలికపాటి మెట్రో సముచితమని నిర్ణయం తీసుకుంది. దీని బాధ్యతలు తామే తీసుకుంటామని రుణ సంస్థలు ముందుకు వచ్చాయి. జర్మనీకి చెందిన మెట్రో నిపుణుడు డాట్సన్ కూడా విజయవాడలో పర్యటించి లైట్ మెట్రోకు సూచనలు చేశారు. ఆ సూచన మేరకు సిస్ర్టా సంస్థకు అప్పగించారు. విజయవాడ, అమరావతి మొత్తం 85 కిలోమీటర్ల దూరం మెట్రోకు ప్రతిపాదనలు చేసింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మెట్రో ఊసే లేకుండా పోయింది. పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎంత ఖర్చు ఎందుకు ఎండీని ప్రశ్నించారు. జర్మనీ ప్రతినిధి బృందం రాలేదు. కేఎఫ్ డబ్ల్యూ సంస్థ సంప్రదింపులు నిలిపివేసింది. బడ్జెట్ లో కూడా మెట్రో ప్రస్తావన లేకుండా పోయింది. ఇటీవల ఎండీ ఎన్ పీ రామకృష్ణారెడ్డి రాజీనామాతో మరోసారి మెట్రో చర్చనీయాంశం అయింది. ప్రభుత్వం దీనికి అంతగా ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో ఎండీ తప్పుకున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.