Shruti Haasan: బోల్డ్ యాటిట్యూడ్ కి శృతి హాసన్ కేర్ ఆఫ్ అడ్రస్. ప్రొఫెషనల్ లైఫ్ లో ఆమె చేసిన రోల్స్, పర్సనల్ లైఫ్ లో నడిపిన రిలేషన్స్ దీనికి నిదర్శనం. కెరీర్ బిగినింగ్ లోనే మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించిన ఘనత ఆమె సొంతం. ఇక ప్రేమ కోసం కెరీర్ ని పణంగా పెట్టిన శృతి ఆలోచనలు ఎవరికీ అర్థంకావు. నచ్చినట్లు బ్రతకడమే శృతి ఫిలాసపీ. ఎవరో ఏదో అనుకుంటారని భయపడే ఆడపిల్ల కాదు. ఇక చేసే పని ఏదైనా పబ్లిక్ గా నిస్సంకోచంగా చేసేస్తుంది. దాపరికాలు, రహస్యాలు ఏమీ ఉండవు.
లండన్ ప్రియుడు మైఖేల్ కోర్ల్సే తో మూడు నాలుగేళ్లు హద్దులు లేకుండా గడిపింది. పలుమార్లు చెన్నైలోని కమల్ నివాసానికి మైఖేల్ ని తీసుకువచ్చింది. కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేయడంతో ఇక పెళ్లి ఖాయం అనుకున్నారందరూ. తీరా 2019లో ఒకరికొకరు బై బై చెప్పుకున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్ నుండి ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు తొలగించారు. ఆ సమయానికి లండన్ లో ఉన్న శృతి అక్కడే చాలా కాలం గడిపారు. బ్రేకప్ తర్వాత అక్కడ లైవ్ మ్యూజిక్ షోలు ఇవ్వడం జరిగింది.
Also Read: Bheemla Nayak: త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ అదిరిపోయింది..!
తిరిగి ఇండియాకు వచ్చిన శృతి మరలా వెండితెరపై బిజీ అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోగా, శృతి స్టార్ హీరోయిన్ హోదాకి దూరం అయ్యారు. అఫైర్స్ లేకుండా రెండేళ్లు ఖాళీగా ఉన్న శృతి, ముంబై నగరంలో కొత్త ప్రియుడ్ని వెతుక్కుంది. డూడుల్ పెయింట్ ఆర్టిస్ట్ శాంతను హజారిక తో కొన్ని నెలలుగా రిలేషన్ నడుపుతుంది. ముంబైలో ఇద్దరూ కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఇక ప్రియుడితో తన సరదాలకు సంబంధించిన ఫోటోలు పబ్లిక్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.అలాగే మైఖేల్ మాదిరి శాంతను ను కూడా కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది. చెల్లి అక్షర హాసన్ బర్త్ డే వేడుకలకు కమల్ హాసన్ తో పాటు కుటుంబ సభ్యులు హాజరు కాగా, శాంతను రావడం విశేషం.
తాజాగా శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో ఆసక్తి రేపుతోంది. ఒకే బెడ్ పై మధ్యలో శృతి ఉండగా ఒక వైపు ప్రియుడు శాంతను మరోవైపు చెల్లి అక్షర ఉన్నారు. ప్రియుడితో శృతి సరదాలు, సరసాలలో అక్షర కూడా పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటో చూశాక… అక్క శృతి లవర్ కాస్తా చెల్లి అక్షర బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడని నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఆమె వెళ్ళిపోతే అతడి పరిస్థితి ఏమిటీ ? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ !