VijayaSai Reddy Comments On RRR Movie: అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని చాటిచెప్పింది ఆర్ఆర్ఆర్ (రౌద్రం, రణం, రుథిరం). పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం సునామీ సృష్టించింది. రికార్డు స్థాయిలో షేర్ వసూలు చేసి మిగతా చిత్ర పరిశ్రమలు టాలివుడ్ వైపు చూసేలా చేసింది. ప్రస్తుతం ‘ఆస్కార్’ ముంగిట నిలిచినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రముఖులు స్పందిస్తున్నారు. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. ట్వట్టర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలక పాత్రలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందింది ఈ చిత్రం. ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.కీరవాణి మంచి నేపథ్య సంగీతం అందించారు. సేంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని అందించారు. అందరి అంచనాలకు అందుకుంది ఈ చిత్రం. అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 25న విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు చేసింది. థియేటర్లలో సునామీ సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ (హిందీ)లో, జీ5 (మళయాళం, తెలుగు, కన్నడం, తమిళం)లో తెగ స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఆస్కారు రేసులో ఉందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో ఇదే వార్త ఇప్పుడు ప్రాధాన్యతాంశంగా వస్తోంది. ప్రముఖ మేగజైన్లు అన్ని ఇప్పుడు ఈ వార్తలనే ప్రచురిస్తున్నాయి. ఆస్కార్ రేసులో ఎన్డీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో తెలుగు నాట అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఆ జాబితాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన చిత్ర యూనిట్ కు పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్ఆర్ఆర్ సినిమా హాలివుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నిలవవచ్చని అంతర్జాతీయ మేగజైన్లు కథనాలు రాస్తున్నాయి. ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమ స్టామినాను తెలియజేస్తోంది. గిరిపుత్రులు బ్రిటీష్ వారిపై పోరాటాన్ని ఇతివృత్తంగా చేసుకొని రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ఆస్కార్ బరిలో నిలుస్తుందని ఆశీస్తున్నా.. అంటూ విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ బరిలో ఉందంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ మేగజైన్లు కథనాలు రాస్తున్నాయి. ఇజ్రాయిల్ లో అయితే ఓ ప్రముఖ పత్రిక తన ఫుల్ పేజీలో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి పేర్కొందంటే ఎంత ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు పక్కా అని తెలుగు సినిమా ప్రముఖులు భావిస్తున్నారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ వంటి విభాగాల్లో ఆస్కార్ బరిలో నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
[…] […]