https://oktelugu.com/

Icon Star Allu Arjun: ముక్కు ముఖం తెలియని హీరోయిన్ కి పాన్ ఇండియా స్టార్ బన్నీ క్షమాపణలు… అసలు ఏం జరిగింది!

Icon Star Allu Arjun: ఒక వర్ధమాన హీరోయిన్ కి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారు. అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ వేడుకపై ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్రీవిష్ణు హీరోగా దర్శకుడు ప్రదీప్ వర్మ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ అల్లూరి. శ్రీవిష్ణు కెరీర్ లో మొదటిసారి సీరియస్ పోలీస్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 18 రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా […]

Written By:
  • Shiva
  • , Updated On : September 19, 2022 / 10:38 AM IST
    Follow us on

    Icon Star Allu Arjun: ఒక వర్ధమాన హీరోయిన్ కి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారు. అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ వేడుకపై ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్రీవిష్ణు హీరోగా దర్శకుడు ప్రదీప్ వర్మ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ అల్లూరి. శ్రీవిష్ణు కెరీర్ లో మొదటిసారి సీరియస్ పోలీస్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 18 రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. అల్లూరి చిత్ర నిర్మాత బెక్కం వేణు గోపాల్ పై ఆయన ప్రశంసలు కురిపించారు.

    Icon Star Allu Arjun

    ఆయన నిర్మించిన ప్రేమ ఇష్క్ కాదల్ నుండి హుషారు వరకు అన్ని చిత్రాలు ఫాలో అయ్యానన్నారు. బెక్కం వేణు గోపాల్ ని అభిరుచి గల నిర్మాతగా కొనియాడారు. ఇక ఈవెంట్ కి హాజరుకావడానికి అసలు కారణం హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు నాకు ఇష్టమైన హీరో. తన మొదటి చిత్రం ప్రేమ ఇష్క్ కాదల్ తో పాటు మెంటల్ మదిలో, అప్పట్లో ఒకడుండేవాడు, రాజ రాజ చోర చిత్రాలు చూశాను. విభిన్నమైన కథలు ఎంచుకుంటాడు. చాలా కష్టపడతాడు. శ్రీవిష్ణుకు నా సప్పోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నేను షూటింగ్ లో బిజీగా ఉన్నా కూడా ఈ ఈవెంట్ కి వచ్చేవాడినని అల్లు అర్జున్ తెలియజేశారు.

    Also Read: Bigg Boss Telugu 6 Eliminations: బిగ్ బాస్ హౌస్ లో కన్నింగ్ అతడే.. ఈ వారం అభినయశ్రీ ఔట్.. లాస్ట్ లో షాకిచ్చిన నాగార్జున

    కాగా ఆయన అల్లూరి చిత్ర హీరోయిన్ పేరును పలకడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కొంచెం భిన్నంగా ఉన్న ఆమె పేరును గుర్తు పెట్టుకోవడం శ్రీవిష్ణుకు కష్టం అనిపించింది. ఈ క్రమంలో ఆయన ఆమెకు సారీ చెప్పాడు. హీరోయిన్ పేరు నాకు ఇప్పటికే మూడు సార్లు చెప్పారు. అయినా నాకు గుర్తు ఉండడం లేదనగానే… నిర్మాత బెక్కం వేణు గోపాల్ చెవిలో చెప్పారు. కయాడు లోహర్ నన్ను క్షమించాలి ఆమె పేరు మర్చిపోయినందుకని అల్లు అర్జున్ వేదికపై అన్నారు. కన్నడ పరిశ్రమకు చెందిన కయాడు లోహర్ అల్లూరి మూవీతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.

    Kayadu Lohar, Sree Vishnu

    ఓ చిన్న స్థాయి హీరోయిన్ కి పాన్ ఇండియా స్టార్ అయినఅల్లు అర్జున్ క్షమాపణలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. కాగా అల్లు అర్జున్ రాకతో అల్లూరి చిత్రానికి మంచి ప్రచారం దక్కింది. సెప్టెంబర్ 23న ఈ మూవీ వరల్డ్ సైడ్ విడుదల కానుంది. రాజ రాజ చోర తర్వాత శ్రీవిష్ణుకు మరలా హిట్ తగల్లేదు. అల్లూరితో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతున్నారు. మరి ఈ పోలీస్ యాక్షన్ డ్రామా ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి.

    Also REad: KCR Vs BJP: బీజేపీకి కేసీఆర్ చెక్ పెడతారా..మైండ్ గేమ్ మేకర్ కేసీఆర్.. 

     

    Recommended videos:

    Tags