Prabhas: టాలీవుడ్ నుండి తొలి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా అవతరించిన హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సిరీస్ తో ఆయనకీ వచ్చిన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిది అంటే..ఆయన ఎంత చెత్త సినిమా తీసిన 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టేంత..దానికి ఉదాహరణగా నిలిచినవే ప్రబస్ గత రెండు చిత్రాలు..ప్రస్తుతం సెట్స్ మీదున్న ప్రభాస్ అన్ని సినిమాల బడ్జెట్ 2000 కోట్ల రూపాయిలు ఉంటుంది..అది ఆయన రేంజ్..తమ హీరో ఇంత రేంజ్ కి ఎదిగిన కూడా ప్రభాస్ అభిమానులకు ఒక తీరని కోరిక ఇంకా మిగిలే ఉంది..అదే అతని పెళ్లి సంగతి..నాలుగు పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికి ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడం అభిమానులను నిరాశకి గురి చేసే విషయం..ఈ ఏడాది కచ్చితంగా చేసుకుంటాను అని ఆయన చెప్తూ వస్తూ 7 ఏళ్ళు దాటింది కానీ..ఇప్పటి వరుకు పెళ్లి జరగలేదు..బాహుబలి సినిమా సమయం లో ఆయన ప్రముఖ టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క తో ప్రేమలో ఉన్నట్టు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

అనుష్క ప్రభాస్ కుటుంబం లో ఏ ముఖ్యమైన ఫంక్షన్ జరిగినా కచ్చితంగా ఉండడం, అంతే కాకుండా ఇటీవల కృష్ణం రాజు గారు చనిపోయిన తర్వాత ఆయనని చూడడానికి ప్రభాస్ తో కలిసి AIG హాస్పిటల్స్ కి వెళ్లడం..ఇలాంటివన్నీ చూసిన తర్వాత కచ్చితంగా వీళ్ళు డేటింగ్ లో ఉన్నారు..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని అభిమానులు మరియు ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు..కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది..ప్రభాస్ గత కొంత కాలం నుండి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమలో ఉన్నట్టు..ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నట్టు..త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తున్న అంశం ఇదే..వీళ్లిద్దరు కలిసి ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు..ఇందులో ప్రభాస్ శ్రీ రాముడిగా నటిస్తుండగా..సీతగా క్రితి సనన్ నషస్తుంది..ఈ సినిమా షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్టు తెలుస్తుంది..ఇందులో ఎంత మాత్రం నిజమో తెలీదు కానీ ప్రభాస్ – క్రితి సనన్ డేటింగ్ లో ఉన్నారు అనే వార్త మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ లో అందరిని షాక్ కి గురి చేస్తుంది..మరి ఈ వార్తపై వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తారో లేదో చూడాలి.