Vijay TVK Elections Tamil Nadu: ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను చాలామంది పల్లి బఠాణీ టైపు అనుకుంటారు. కానీ అందులో నూటికి నూరు శాతం వాస్తవం లేకపోయినప్పటికీ.. కనీసం 70% వరకైనా నిజం ఉంటుంది. ఎందుకంటే, ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఫలితాలను ప్రతిబింబించకపోయినప్పటికీ.. ఎంతోకొంత వాస్తవాన్ని మాత్రం బయట పెడతాయి.. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. ఇందులో ఆసక్తికరంగా ఉన్నది టీవీ కే విజయ్ భవితవ్యం..
విజయ్ కి గతంలోని పెళ్లయింది. ఇతడు తన మహిళా అభిమానిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆమెతో మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటున్నాడు. విజయ్ కి ఓ కుమారుడు, కుమార్తె సంతానం.. భార్యతో దూరంగా ఉంటున్న విజయ్.. ఓ సినీ నటితో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎన్నికలకు ముందే పెద్ద ఎత్తున దుమారం ఏర్పడింది. పైగా దానిని నిజం చేస్తూ విజయ్, ఆ సినీ నటితో ఓ వివాహ వేడుకకు జంటగా హాజరయ్యాడు. పైగా తన భార్యకు విడాకుల సెటిల్మెంట్ కింద కొంతమేర ఆస్తి ఇచ్చేందుకు విజయ్ సుముఖంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే విజయ్ భార్య దానికి ఒప్పుకోలేదని సమాచారం.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరిగానే పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో విజయ్ కి యాక్సిస్ మై ఇండియా మినహా మిగతా ఏ సంస్థ కూడా అనుకూలంగా ఫలితాన్ని ప్రకటించలేదు. యాక్సిస్ మై ఇండియా విజయ్ విషయంలో సానుకూలంగా స్పందించింది. అతని ఆధ్వర్యంలో టీవీకే పార్టీ 98 నుంచి 120 స్థానాలు సాధిస్తుందని తెలిపింది. ఇక మిగతా సంస్థలు ఏవీ కూడా టీవీకేకు అధికారం వస్తాయని చెప్పలేదు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును టీవీకే పార్టీ చీల్చిందని.. అందువల్లే ఏఐడీఎం కే ఈసారి కూడా అధికారానికి దూరంగా ఉండి పోవాల్సి ఉంటుందని ప్రకటించాయి.
ఎన్నికల ప్రచారంలో టీవీ కె విజయ్ అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. ఆయన నిర్వహించిన ఓ సభలో భారీ ఎత్తున ప్రాణ నష్టం చోటుచేసుకుంది. దీన్ని మర్చిపోకముందే భార్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జననాయగన్ సినిమా విడుదల్లో కూడా జాప్యం ఏర్పడుతోంది. ఇన్ని అవరోధాల మధ్య విజయ్ అధికారంలోకి వస్తారు అనుకుంటే.. అది కూడా నెరవేరని పరిస్థితి.. రెండిళ్ల పూజారిగా మారిన విజయ్.. చివరికి రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయారు. ఇప్పటికే సినిమాలకు వీడ్కోలు పలికిన.. కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.