spot_img
Homeజాతీయ వార్తలుVijay party zero seats: అక్కడ విజయ్ పార్టీని దేకినోడు లేడు.. ఒక్క సీటూ దిక్కులేదు..

Vijay party zero seats: అక్కడ విజయ్ పార్టీని దేకినోడు లేడు.. ఒక్క సీటూ దిక్కులేదు..

Vijay party zero seats: తమిళనాడులో టి వి కే హవా కొనసాగిస్తోంది. 110 స్థానాలలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అధికారాన్ని దక్కించుకోవడానికి ఇంకా ఆ పార్టీకి 8 స్థానాలు కావాలి.. అన్నా డీఎంకేతో సంప్రదింపులు జరుగుతున్నాయి కాబట్టి.. పెద్దగా ఇబ్బందులు లేవు. ఈ ప్రకారం అన్నా డీఎంకే, టి వి కే కలిసి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా దాదాపు ఖాయం.

తమిళనాడులో విజయ విహారం చేసిన టి వికే.. పుదుచ్చేరి ప్రాంతంలో మాత్రం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఒక స్థానంలో లీడ్ లో కొనసాగుతోంది. అయితే ఇందులో విజయం సాధిస్తుందా.. అనేది చెప్పడం కష్టమే. 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో.. ఎన్డీఏ 15 స్థానాలు గెలుచుకొని అధికారాన్ని దక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలను సాధించింది. మూడు స్థానాలలో ఇతరులు లీడ్ లో కొనసాగుతున్నారు.. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ తమిళ సంస్కృతి అధికంగా ఉంటుంది. ఒకరకంగా దీనిని తమిళనాడు అనుబంధ ప్రాంతంగా చెప్తారు. తమిళనాడు రాజకీయాలలో చోటు చేసుకునే ప్రతి పరిణామం పుదుచ్చేరి భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. తమిళనాడులో ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలోనూ పుదుచ్చేరి ప్రాంతంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయి.

ఈసారి తమిళనాడులో టీవీ కె ఘనవిజయం సాధించింది. పార్టీ ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే ఈ స్థాయిలో ఫలితాలు వచ్చాయంటే మామూలు విషయం కాదు. కాకపోతే తమిళనాడులో రేసుగుర్రం లాగా దూసుకుపోయిన టివి కే.. పుదుచ్చేరి ప్రాంతంలో మాత్రం ఆ స్థాయి ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ పార్టీకి కనీసం రెండు స్థానాలు కూడా ఇక్కడ రాలేదు. ఒక స్థానంలో లీడ్ లో కొనసాగుతున్నప్పటికీ.. అందులో విజయం సాధిస్తుందని గ్యారెంటీ లేదు. ఒకవేళ విజయం సాధిస్తే టీవీకే ఖాతాలో ఒక సీటు పడుతుంది. తమిళనాడులో ఘనవిజయం సాధించిన పార్టీ.. పుదుచ్చేరిలో చేతులెత్తయడం నిజంగా ఆశ్చర్యకరమే.

“తమిళనాడు పరిస్థితులు పుదుచ్చేరిలో పునరావృతమవుతాయని మేము అనుకున్నాం. కాకపోతే మా అంచనాలు పూర్తిగా తప్పాయి. అందువల్లే ఇక్కడ మేము మా స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయాం. కాకపోతే ఈ ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మా స్థాయిని చూపిస్తామని” టీవీకే నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
Oktelugu Epaper
Exit mobile version