Tamil Nadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రతిరోజు విజయ్ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నారు.. పరిపాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. అందువల్లే మీడియా మొత్తం విజయ్ నామస్మరణ చేస్తోంది. గతంలో జాతీయ మీడియా తమిళ రాజకీయాలను అంతగా పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు తమిళనాడుకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తోంది. దీనిని బట్టి విజయ్ తమిళ పాలిటిక్స్ ను ఏ విధంగా మార్చారో అర్థం చేసుకోవచ్చు.
విజయ్ అన్ని మతాలను సమానంగా ఆచరిస్తారు. క్రైస్తవుడు అయినప్పటికీ తన తల్లి కోరిక కోసం తమిళనాడులో సాయిబాబా ఆలయాన్ని కట్టించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సాయిబాబా ఆలయానికి ఆయన వెళ్లారు. అంతేకాదు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరు ప్రాంతంలో మూకాంబిక ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అకస్మాత్తుగా విజయ్ అక్కడికి ఎందుకు వెళ్లారు అనే ప్రశ్నలు తమిళనాడు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కావేరి నది మీద కర్ణాటక ప్రభుత్వం డ్యాం కడుతోంది. దీనిపై తమిళనాడులో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయింది. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయంగా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ కర్ణాటక వెళ్లడం ఒకరకంగా చర్చకు దారి తీసింది.
మూకాంబిక ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరు ప్రాంతంలో ఉంటుంది. ఇది మంగళూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత విజయ్ ఒక్కసారిగా డ్రైవర్ అవతారం ఎత్తాడు. ముకాంబిక ఆలయం నుంచి మంగళూరు విమానాశ్రయం వరకు దాదాపు 130 కిలోమీటర్లు తన సీఎం కాన్వాయ్ లోని కారును నడుపుకుంటూ వెళ్లిపోయారు. అంతేకాదు మధ్యలో ఒక అభిమాని విజయ్ ని గుర్తుపట్టి చెయ్యి ఊపారు. దానికి విజయ్ కూడా బదులుగా అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సంచలనం కలిగిస్తోంది.
ఇటీవల కాలంలో సంచలన నిర్ణయాలతో ఆకట్టుకుంటున్న విజయ్.. ఇప్పుడు ఏకంగా 130 కిలోమీటర్ల పాటు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. విజయ్ కి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అందువల్లే అతడు తన కాన్వాయ్ లోని కారును ఇలా నడుపుకుంటూ వెళ్లిపోయాడు. చాలా కాలం తర్వాత కారు స్టీరింగ్ పట్టిన విజయ్.. స్వేచ్ఛగా డ్రైవింగ్ చేశాడు. డ్రైవింగ్ చేస్తున్నంత సేపు ఉల్లాసంగా కనిపించాడు. సూటు.. బూటు.. చేతిలో స్టీరింగ్ అదిరిపోయిందయ్యా విజయ్ అంటూ తమిళ ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సీఎం పదవి పక్కన పెట్టి విజయ్ డ్రైవర్ గా మారిపోయారని.. ఆస్థానంలో ఆయనకు నచ్చిన మహిళను కూర్చోబెడతారేమోనని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

