Vietnam air hostesses : ఎయిల్ హోస్ట్ అనగానే విమానంలో ప్రయాణికులకు సేవలు అందించే మహిళలు గుర్తొస్తారు. అన్ని విమాన సంస్థలు ఎయిర్ హెస్ట్‌లుగా అందమైన యువతులనే నియమిస్తాయి. వీరికి ఆయా సంస్థలు మంచి వేతనాలు కూడా ఇస్తాయి. అయితే వియత్నాంలో ఎయిర్ హోస్ట్‌లు మూన్‌లైటింగ్ చేస్తున్నారు. అదనపు ఆదాయం కోసం వ్యభిచారిణులుగా మారుతున్నారు. బుధవారం వియత్నాం హోచిమిన్ సిటీలోని ఒక విలాసవంతమైన హోటల్‌పై అధికారులు దాడి చేశారు. అక్కడ వారు ముగ్గురు యాక్టివ్ ఫ్లైట్ అటెండెంట్‌లను వేర్వేరు పురుషులతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరు ఒక రాత్రికి వీరు 3 వేల డాలర్లు(రూ.2.4 లక్షలు) వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. మోడల్‌గా ఉన్న నాలుగో మహిళ కూడా కస్టమర్‌తో తిరుగుతుండగా అరెస్టు చేశారు.
ఛేదించిన పోలీసులు…
వియత్నాంలో ధనవంతులైన ప్రయాణికులకు ఎయిర్ హోస్ట్‌లు విమానంలో సేవలు అందించడంతోపాటు విమానం దిగిన తర్వాత ఎయిన్ పోర్టులో పడక సుఖం కూడా అందిస్తున్నారు. పక్కా సమాచారంతో దాడు చేసి ఈ వ్యభిచార రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ముగ్గురు ఎయిర్ హోస్ట్‌లు వ్యభిచారం చేస్తుండగా పట్టుపడ్డారు. విచారణ జరుపగా 30 మంది ఎయిర్ హెస్ట్ సిబ్బంది మూన్‌లైటింగ్ ద్వారా సెక్స్ వర్కర్లుగా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కస్టమర్లను ఆకర్షించేలా..
నగరంలోని లేథీ రియెంగ్ స్ట్రీట్‌లోని భవనంలో ఈ వ్యభిచార రాకెట్ సాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. విమాన ప్రయాణికులను ఈ ఎయిర్ హోస్ట్‌లు విమానంలో ఉన్నప్పుడే ఆకట్టుకుంటున్నారని, శృంగారానికి ప్రేరేపిస్తున్నారని గుర్తించారు. 26 ఏళ్ల రింగ్ లీడర్ వోథిమై హన్హ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆమె తమ ఎయిర్‌లైన్ యూనిఫాంలో తన అమ్మాయిల చిత్రాలను పురుషులకు పంపిందని తెలిపారు. వోథి మైహన్హ్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా ఉండి ఈ దందాను నడిపిస్తోందని అధికారులు తెలిపారు. వ్యభిచారం , లైంగిక సేవల మధ్యవర్తిత్వంపై అనుమానంతో వోథిమై హన్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వోథిమైహన్ ఈ బ్రోకింగ్ చేస్తున్నట్లు నిర్ధారించారు. పట్టుబడిన నలుగురు మహిళలు వ్యభిచారం కోసం హోటల్ కు వచ్చినట్లు పేర్కొన్నారు. తాము నేరం చేసినట్లు అంగీకరించారు.