Poor Quality Roads : కాదేదీ కల్లీకి అనర్హం అన్నట్టుంది దేశంలో పరిస్థితి. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, నూనె పీపా.. ఇలా అన్నింటిని దేశంలో కల్తీ చేసే మహాత్ములు ఉన్నారు. రోడ్లను కూడా నాసిరకంగా వేస్తూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి దేశంలో ఉంది. దేశంలో గుంతలు లేని రోడ్లు ఎక్కడ చూసినా ఉంటాయి. ప్రభుత్వాలు, అధికారులు ఎంత ప్రచారం చేసుకున్నా.. నాసిరకం రోడ్లు మన కళ్లముందే కనిపిస్తాయి. గుంతలు, అధ్వాన్నమైన రోడ్లు, నిర్మాణాల కష్టాలు భారతదేశం అంతటా వీధుల్లో కనిపిస్తాయి.

ఇటీవల ఒక వైరల్ వీడియో ఇంటర్నెట్‌లో కనిపించింది, అందులో ఒక వ్యక్తి రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యంను స్వయంగా చూపించాడు. యువకుడు నాసిరకంగా వేసిన రోడ్డును చూపించాడు. తన స్వంత చేతులతో నాసిరకం రోడ్డు కంకరను తీసివేస్తూ ప్రజలకు ప్రభుత్వాల ఘనకార్యంను వీడియోలో బంధించాడు. దేశంలో రోడ్ల దుస్థితిపై అత్యంత అధ్వాన్నమైన పరిస్థితులను హైలైట్ చేశాడు.
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో కొత్తగా నిర్మించిన రహదారి ఎంత నాసిరకంగా వేశారో ఆ అధ్వాన్నమైన రోడ్డును ఆ వ్యక్తి చూపించాడు. 3 కోట్ల 80 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డులో లూజు కంకరను ఓ వ్యక్తి కూల్చివేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
ప్రధాన మంత్రి సడక్ యోజన కింద జిల్లాలోని పురాన్‌పూర్-భగ్వంతపూర్ గ్రామం మధ్య రూ.3 కోట్ల 80 లక్షలతో ఈ రహదారిని నిర్మిస్తున్నారు.
पीलीभीत में 3.81 करोड़ रुपये से बनी नई सड़क, शख्स ने हाथों से उखाड़ कर दिखाई क्वालिटी#Pilibhit #UttarPradesh #BrokenRoads pic.twitter.com/lhkMZMJDCX
— Zee News (@ZeeNews) November 13, 2022
ఆజ్ తక్ నివేదిక ప్రకారం.. కొత్తగా నిర్మించిన ఈ రహదారి గత రోజు కేవలం ఒక వాహనం బ్రేకులు వేయడంతో దెబ్బతిన్నది. నాసిరకం నాణ్యతతో పాటు నాసిరకం ఉత్పత్తులను రోడ్డుకు వినియోగిస్తుండడంపై గ్రామస్తులు నిరసనకు దిగారు. ఓ యువకుడు ఎంత దారుణంగా రోడ్డు వేశారన్నది స్వయంగా కళ్లకు కట్టినట్టు చూపించాడు.