https://oktelugu.com/

బిగ్ బాస్ తో రహస్య ఒప్పందం వల్లే మోనాల్ కి ఛాన్స్ !

బుల్లితెర మీద బిగ్ బాస్ షో చేసే సందడి మాములుగా ఉండదు, మూడు నెలలు పాటు కొనసాగే ఈ ఒక్క షోతో స్టార్ మా ఛానల్ టిఆర్పి రేటింగ్స్ లో టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. అయితే, 2020 సీజన్ మొదలయినప్పుడు ప్రేక్షకుల నుండి విమర్శలు వచ్చాయి. షోలో తీసుకున్న కంటెస్టెంట్లు ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకి చాలా దూరంగా ఉండిపోవటమే దానికి కారణం. ఆ తర్వాత బిగ్ బాస్ షో మీద హైప్స్ పెంచేసాడు. ఇదంతా ప్రీ […]

Written By:
  • admin
  • , Updated On : December 27, 2020 / 01:12 PM IST
    Follow us on


    బుల్లితెర మీద బిగ్ బాస్ షో చేసే సందడి మాములుగా ఉండదు, మూడు నెలలు పాటు కొనసాగే ఈ ఒక్క షోతో స్టార్ మా ఛానల్ టిఆర్పి రేటింగ్స్ లో టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. అయితే, 2020 సీజన్ మొదలయినప్పుడు ప్రేక్షకుల నుండి విమర్శలు వచ్చాయి. షోలో తీసుకున్న కంటెస్టెంట్లు ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకి చాలా దూరంగా ఉండిపోవటమే దానికి కారణం. ఆ తర్వాత బిగ్ బాస్ షో మీద హైప్స్ పెంచేసాడు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ అని చాలా మంది ఎద్దేవా చేస్తున్నా వాటిని నిజం చేసేలానే బిగ్ బాస్ చర్యలు ఉంటాయి. వీక్ ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లలో బాగా తక్కువ ఓట్లు పడిన వారిని కూడా సేవ్ చేస్తూ షో ని ఆసక్తికరంగా మారుస్తుంటాడు. కొంత మంది సభ్యులతో కొన్ని ఇన్సైడ్ ఒప్పందాలు కుదుర్చుకుని షో ని నడిపిస్తున్నట్లుగా అర్ధమవుతుంది.

    Also Read: టీజర్ తో తెగ నవ్వించిన ‘జాతి రత్నం’ !

    అలాంటి వారికి బిగ్ బాస్ షో అనంతరం కూడా అవకాశాలు లభిస్తాయని అందుకు తగ్గట్లుగానే బిగ్ బాస్ ఆడమన్నట్లు ఆడతారని ట్రోలింగ్ జరుగుతుంది. బిగ్ బాస్ షో అయ్యాక కొంత మంది కంటెస్టెంట్లకు స్టార్ మా మంచి అవకాశాలనే ఇచ్చింది. తాజాగా మోనాల్‌కి కూడా స్టార్ మా ఓ ఆఫర్ ఇచ్చింది. రెండో సీజన్ బిగ్ బాస్ షో ముగిసిన తరువాత తేజస్వీకి స్టార్ మా ఓ ఆఫర్ ఇచ్చింది. బ్రహ్మానందంతో కలిసి స్టార్ మా స్డాండప్ కామెడీ అంటూ తేజస్వీ రచ్చ చేసింది. బిగ్ బాస్ షోలో తేజస్వీ మీదున్న నెగెటివిటి కారణంగానే ఆ షో అనుకున్నంత సక్సెస్ అవ్వలేదని సమాచారం. మూడో సీజన్ తరువాత శ్రీముఖికి సైతం స్టార్ మ్యూజిక్ అంటూ ఓ మ్యూజిక్ షోని సెట్ చేశారు. అది కూడా క్లిక్ అవ్వలేదు.

    ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ నాల్గో సీజన్ తరవాత మోనాల్ కి కూడా అలాంటి అవకాశమే ఇచ్చినట్లుగ తెలుస్తుంది. నాలుగవ సీజన్ మొత్తం మోనాల్ చుట్టూనే తిరిగింది. అభిజిత్,అఖిల్,మోనాల్ అంటూ నాల్గో సీజన్ బాగానే నడిచింది. అయితే మోనాల్ టాపిక్ లేకుండా ఎపిసోడ్ మాత్రం జరగలేదు. మోనాల్ మీద ఎంత తీవ్ర వ్యతిరేకత ఉన్నా కూడా ఆమె ఎలిమినేట్ అవుతుందని ఎన్ని సార్లు అనుకున్నా కూడా బిగ్ బాస్ సేవ్ చేస్తూనే వచ్చాడు. దీనికి కారణం మోనాల్ తో చేసుకున్న ఒప్పందమని గుస గుసలాడుతున్నారు. అందుకే ఆమె అలా బయటకు వచ్చిందో లేదో ఇలా స్టార్ మా ఛానల్ లో ఒక షోలో చాన్స్ వచ్చేసిందని అందరూ అనుకుంటున్నారు.

    Also Read: అభిజిత్ కి పెళ్లి చేస్తున్నామన్న తల్లి!

    స్టార్ మా ఛానల్ లో ఓంకార్ చేసే షోల హడావిడి గురించి అందరికి తెలిసిందే కదా, అలానే ఆయన ఇప్పుడొక సరికొత్త కాన్సెప్ట్ తో డ్యాన్స్ ప్లస్ అంటూ ఒక షోని ప్రారంబించబోతున్నారు. ఇప్పటికే షోకి సంబంధించి కొన్ని ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. తాజాగా విడుదల అయిన ప్రోమోలో మోనాల్ కనువిందు చేయటంతో ప్రేక్షకుల ఆసక్తి ఈ షో మీదకి మళ్లింది. అయితే ఇందులో మోనాల్ జడ్జ్‌గా వ్యవహరిస్తుందా? లేదా హోస్ట్‌గా చేస్తుందా అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఈ షో తొలి ఎపిసోడ్ ఈ రోజు టెలికాస్ట్ అవుతుందట. తేజస్విని, శ్రీముఖిలా అట్టర్ ప్లాప్ అవుతుందో లేదా హిట్ కొట్టి కెరీర్ గాడిన పెట్టుకుంటుందో చూద్దాం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్