spot_img
Homeఎంటర్టైన్మెంట్Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో...

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, ఇది తప్పు అయితే జాతకలు చెప్పడం మానేస్తానని శపధం కూడా చేశారు. ఆయన చెప్పింది జరగకపోవడం తో, జాతకలు చెప్పడం ఆపేస్తున్నాను అని ప్రకటన ఇచ్చి, మళ్ళీ కొన్నాళ్ళకు నాగ చైతన్య, శోబిత విడిపోతారు అంటూ వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజే సంచలన వ్యాఖ్యలు చేసారు వేణు స్వామి. ఈ వ్యాఖ్యలపై నెటిజెన్స్ ఊహించని రీతిలో వేణు స్వామి కి కౌంటర్ అటాక్ ఇచ్చారు, చివరికి మహిళా కమీషన్ కూడా మండిపడడం తో వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పారు వేణు స్వామి. అప్పటి నుండి సైలెంట్ గా ఉంటూ వచ్చిన ఆయన, రీసెంట్ గా నెమ్మదిగా కం బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే నీట్ ప్రశ్న పత్రం లేకేజి కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలంటూ గత కొద్దీ రోజులుగా ఢిల్లీ లో ఏ స్థాయి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యం జెన్ జీ యువత ఈ ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ, రోజురోజుకి ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం తో కేంద్రం రెండు మెట్లు కిందకు దిగి రాక తప్పలేదు. కాసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ అంశాన్ని ఆధారంగా తీసుకొని వేణు స్వామి కాసేపటి క్రితమే ఒక వీడియో ని విడుదల చేశారు.

ఈ వీడియో లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘ కాక్రోచ్ జనతా పార్టీ కి అక్టోబర్ 31 వరకు ఒక క్రేజ్.. ఆ తర్వాత మరోరకమైన క్రేజ్ వస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ వల్ల బీజేపీకి, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీకి ఇబ్బందులు తప్పవు’ అంటూ చెప్పుకొచ్చారు వేణు స్వామి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు నెటిజెన్స్.. ప్రస్తుత పరిస్థితులు ఆధారంగా ఈ మాత్రం చిన్న పిల్లవాడు కూడా చెప్పగలరని, ఇంకెంత కాలం జాతకాల పేరుతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper