KCR NTR CBN : ఎన్టీఆర్‌.. కేసీఆర్‌.. ఓ చంద్రబాబు.. వెంకయ్య చెప్పిన ‘వెన్నుపోటు’ కథ!

KCR NTR CBN : పెద్దల మాట సద్దన్నం మూట అంటారు.. పెద్దలు భావి తరాలకు మార్గ నిర్దేశకులు.. అలాగే రాజకీయ ఉద్దండులు.. భవిష్యత్‌ రాజకీయాలకు దిశానిర్దేశకులు.. రాజకీయ అనుభవాన్ని.. ఎదుర్కొన్న సవాళ్లు.. అధిరోహించిన తీరు.. సమకాలీన రాజకీయాల గురించి వారు చెప్పే విధానానికి ఒక కచ్ఛితత్వం ఉంటుంది. ఇలాంటి రాజకీయ ఉద్దండుడిగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో […]

Written By: NARESH, Updated On : December 25, 2022 12:04 pm
Follow us on

KCR NTR CBN : పెద్దల మాట సద్దన్నం మూట అంటారు.. పెద్దలు భావి తరాలకు మార్గ నిర్దేశకులు.. అలాగే రాజకీయ ఉద్దండులు.. భవిష్యత్‌ రాజకీయాలకు దిశానిర్దేశకులు.. రాజకీయ అనుభవాన్ని.. ఎదుర్కొన్న సవాళ్లు.. అధిరోహించిన తీరు.. సమకాలీన రాజకీయాల గురించి వారు చెప్పే విధానానికి ఒక కచ్ఛితత్వం ఉంటుంది. ఇలాంటి రాజకీయ ఉద్దండుడిగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో ఎన్టీఆర్‌తోపాటు కేసీఆర్, చంద్రబాబు రాజకీయాలను ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.

అందరినీ నమ్మే.. వెన్నుపోటుకు గురయ్యాడు..
తెలుగు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత నందమూరి తారకరామారావు అని వెంకయ్య అన్నారు. జాతీయ స్థాయిలో తెలుగు రాజకీయాలకు గుర్తింపు తెచ్చడన్నారు. రాజకీయాలకు కొత్త ఒరవడి తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌ అన్నారు. రాజకీయాల్లో ఒక కొత్త విప్లవం సృష్టించారు గుర్తుచేశారు. బలహీన వర్గాలకు రాజకీయాలలో ప్రధాన స్థానం కల్పించారన్నారు. ఎన్టీఆర్‌ కల్మషం లేని వ్యక్తి అని తెలిపారు. అందరినీ నమ్మేవారని, కుట్రలు, కుతంత్రాలు ఎన్టీఆర్‌ గమనించలేకపోయారని అందుకే వెన్నుపోటుకు గురయ్యారని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి అయ్యాక రాజకీయాలు వదిలేశానన్న ఆయన.. కానీ ప్రజలను కలవడం మాత్రం మానుకోలేదన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని, జాతీయవాద భావనతో మిళితం చేసి ఎన్టీఆర్‌ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళారు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పి, విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనాన్ని చెప్పి, ప్రత్యామ్నాయ రాజకీయాల మార్గదర్శకుడిగా, ప్రజాభ్యుదయమార్గ నవ్య పథగామిగా తనదైన ముద్ర వేశారన్నారు.

బాబు–కేసీఆర్‌కు చురకలు..
ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారే విధానం సరికాదని వెంకయ్య అభిప్రాయపడ్డారు. నచ్చిన వారు నచ్చిన పార్టీలో చేరడంలో తప్పు లేదన్నారు. కానీ పదవుల్లో ఉంటూ వేరే పార్టీలో చేరడం మాత్రం సరికాదన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు అధికార పార్టీల్లో చేరడమే కాకుండా, మంత్రి పదవులు కూడా పొందారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు, కేసీఆర్‌కు పరోక్షంగా వెంకయ్య చురకలు తగులుతున్నాయి.

ఏపీ, తెలంగాణ గురించి చెప్పట్లేదంటూ
పార్టీ మారాలనుకుంటే, ఆ పార్టీ వల్ల వచ్చిన పదవులను వదులుకొని వేరే పార్టీలో చేరవచ్చునని హితవు పలికారు. తాను ఏపీ, తెలంగాణల గురించి చెప్పడం లేదని, దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రజల తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే అన్నారు.

ఏదైనా చర్చించుకోవాలి
చట్ట సభల్లో అర్థవంతమైన చర్చ జరగాలని ఆకాంక్షించారు. తెలుగు భాష గొప్పతనం గురించి వెంకయ్య చెప్పారు. ఇంగ్లిష్‌ నేర్చుకోవద్దని చెప్పడం లేదని, కానీ మాతృభాషను మరిచిపోవద్దన్నారు. మమ్మీ, డాడీ అంటే ఆ మాటలు పెదవుల చివరి నుంచే వస్తాయని, అమ్మ, నాన్న అంటే లోతు నుంచి వస్తుందన్నారు. ఉత్తర తెలంగాణలో భాష ఓ రకంగా, దక్షిణ తెలంగాణలో మరో రకంగా ఉంటుందన్నారు. దట్స్‌ ది బ్యూటీ… యూనిటీ ఇన్‌ డైవర్సిటీ.. అని వెంకయ్య అన్నారు.

కేసీఆర్‌ ఆదర్శంగా నిలిచారు.. బాబు అనుసరించాలి
ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేగాక, ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల పేర్లను కూడా తెలుగులోనే రాయాలని ఆయన ఆదేశించారు.

కేసీఆర్‌కు అభినందనలు
ఇంటర్‌ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వెంకయ్యనాయుడు ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మాతృభాషకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరలో ఏపీ కూడా ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.