Venkaiah Naidu: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీలో జోష్ పెరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాలను కమలం నాయకులు దక్కించుకోవడంతో ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. 2024లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందుకు సంబంధించిన సమీకరణాలు చేయనున్నారు. అయితే అంతకుముందు రాష్ట్ర పతి ఎన్నికపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనుంది. ఈనెల 31న రాజ్యసభ ఎన్నికలు జరిగే సమయంలోనే రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాలని కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఇతర పార్టీల సహకారంతో బీజేపీ ప్రతిపాదించే అభ్యర్థిని గెలిపించాలని ప్రయత్నించారు. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కమలం పార్టీకి ఇతర పార్టీల అవసరం దాదాపు ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాడు రాష్ట్రపతిగా పోటీ చేయనున్నారా..? అనే చర్చ సాగుతోంది.
భారత రాష్ట్రపతిని ఎన్నుకోవాలంటే 10,98,903 ఓట్లు అవసరం ఉంటాయి. అయితే బీజేపీకి ఇప్పటికే సగం కంటే ఎక్కువ బలం ఉంది. ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 ఉంటే.. ఎమ్మెల్యేల ఓట్ల విలువ మాత్రం ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని ఎమ్మెల్యేల ఓటు విలువ 208గా ఉంది. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో యూపీ బీజేపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రపతి ఎన్నిక సులభతరం కానుంది. దీంతో బీజేపీ ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికపైనే దృష్టి పెట్టింది.
రాష్ట్రపతి పదవి కోసం ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు పేరును ప్రతిపాదించనున్నారా..? అనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఉన్న రామ్ నాధ్ కోవింద్ రెండో సారి అవకాశం ఇస్తారా..? లేక కొత్త వారిని ఎన్నుకోనున్నారా..? అనే చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ మాత్రమే రెండుసార్లు పనిచేశారు. దీంతో రామ్ నాథ్ కు మరో అవకాశం ఇవ్వడం అనుమానమే అన్నట్లుగా సాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఉత్తరాది నాయకులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. దక్షిణాదిపై చిన్న చూపుచూస్తున్నారన్న వాదన విపిస్తోంది. ఇందులో భాగంగా వెంకయ్యనాయకుడుకు ప్రాధాన్యత ఇస్తారా..? అని అనుకుంటున్నారు.
Also Read: Kapu Community : రెడ్డిలు, కమ్మలకు వేలకోట్లు.. కాపులకు పిసిరంత? జగన్ కు కాపులు అవసరం లేదా?
గతంలో వెంకయ్యనాయుడు ఏపీలో పర్యటించిన సందర్భంలో పలు ఆసక్తి కామెంట్లు చేశారు. ప్రజలు తనను రాష్ట్రపతిగా చూడాలని అనుకుంటున్నారన చెప్పారు. దీంతో వెంకయ్య ప్రమోషన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీకి అనుకూలంగా మారడంతో అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి ఎన్నిక కోసం బీజేపికి మెజారీటీ బలం ఉన్న ఇతర పార్టీ అభిప్రాయాన్ని కూడా లెక్కలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బీజేపికి ప్రతీ విషయంలో మద్దతు ఇస్తున్న వైసీపీ, బీజుజనతాదళ్ తో చర్చలు జరిపి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే బీజేపీ వ్యతిరేక కూటమి తరుపున ఓ అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తున్నారు. కానీ ఎక్కువగా బీజేపీకే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్ర పతిని ఎన్నిక ద్వారా కాకుండా ఏకగ్రీవంగా చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. అవసరమైతే ప్రతిపక్షాలు బరిలో దింపే అభ్యర్థిని కన్విన్స్ చేసి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు.
ఇప్పటి వరకు ఎలాంటి పేరు ప్రతిపాదించకపోయినా వెంకయ్యనాయుడికు ప్రమోషన్ ఇస్తారన్న చర్చ సాగుతోంది. కానీ బీజేపీ మాత్రం అందరిని సంప్రదించిన తరువాత అభ్యర్థి ప్రకటన చేయనున్నారు. ఒకవేళ వెంకయ్యనాయుడికి అవకాశం రాకపోతే ఆయనను బుజ్జగిస్తారా..? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే 31 వరకు జరిగే పరిణామాలపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
Also Read: Janasena : జనసేన సైన్యంలోకి మరికొందరు..