Varahi Yatra Campaign GVMC: కొలువులు, పదోన్నతుల కోసం కొందరు అధికారులు ప్రభుత్వానికి సాగిలా పడుతున్న రోజులు ఇవి. తప్పును తప్పు అని ప్రశ్నించలేకపోతున్నారు. తమను తాము కాపాడుకోలేకపోతున్నారు. అటువంటిది ఓ పారిశుధ్య కార్మికుడు ఏకంగా ప్రభుత్వానికే ఎదురెళ్ళాడు. పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాన్ని సైతం దూరం చేసుకున్నాడు. విశాఖలో వెలుగు చూసింది ఈ ఘటన.
పవన్ వారాహి మూడో విడత యాత్ర విశాఖలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ యాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయినా సరే పవన్ అభిమానులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. యాత్రను సక్సెస్ చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్లో పారిశుద్ధ్య వాహనం డ్రైవర్ ఏకంగా మైక్ లోనే అనౌన్స్ చేశాడు. చెత్త వాహనానికి ఉన్నమైక్ లో పవన్ వారాహి యాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.
అసలే పవన్ పై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వ వర్గాలకు.. చెత్త వాహనం డ్రైవరు మరింత ఆగ్రహం తెప్పించాడు.ఇంకేముందిఔట్సోర్సింగ్ ఉద్యోగం నుంచి అతడ్ని తప్పించారు. అయితే ఉద్యోగం పోతుందని తెలిసినా.. పవన్ పై అభిమానం చాటిన సదరు పారిశుద్ధ్య కార్మికుడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు, అభిమానులు అభినందనలతో ముంచేత్తుతున్నారు.