Vangaveeti Radha Krishna: సీనియర్ నాయకుడు, టీడీపీ నేత వంగవీటి రాధాక్రిష్ణ ఆ పార్టీని వీడుతారా? జనసేన గూటికి చేరుతారా? పార్టీ మారే విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వచ్చారా? తన తండ్రి వంగవీటి మోహన్ రంగా జయంతి నాడు ముహూర్తం నిర్ణయించుకున్నారా? పవన్ వచ్చి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు నిజం చేస్తున్నాయి. అయితే దీనిపై రాధాక్రిష్ణ ఎటువంటి ప్రకటన చేయలేదు. అటు జనసేన కార్యాలయ వర్గాల నుంచి కూడా ఎటువంటి స్పష్టత లేదు. అయితే గత కొద్దరోజులు రాజకీయ వర్గాల్లో మాత్రం తెగ ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రాధాక్రిష్ణ టీడీపీలో ఉన్నా ఏమంత యాక్టివ్ గా లేరు. కానీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలన్న బలమైన ఆకాంక్ష మాత్రం ఆయనలో ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొద్దిరోజుల కిందట తన హత్యకు భారీ స్కెచ్ జరిగిందని రాధాక్రిష్ణ బాంబు పేల్చారు. రెక్కీ కూడా నిర్వహించారని ప్రకటించారు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. సంచలనం రేకెత్తించింది. దీంతో ప్రభుత్వం స్పందించి గన్ మెన్లను నియమించిన రాధా నో చెప్పారు. అటు తరువాత చంద్రబాబు పరామర్శించడం, దానికి రాధాతో పాటు కుటుంబసభ్యులు కూడా ఎంతగానో సంతోషించారు. టీడీపీతో మంచి సంబంధాలే నెరుపుతూ వచ్చారు. అయితే ఇటీవల ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం అయితే సాగుతోంది. దీనిని ఆయన ఖండించకపోవడంతో చేరిక దాదాపు ఖాయమైందన్న వాదన వినిపిస్తోంది.
వంగవీటి జయంతి రోజున,,
ఈ నెల 4న వంగవీటి మోహన్ రంగా జయంతి. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా వివిధ పార్టీల్లో ఉన్న కాపు సామాజికవర్గం నాయకులు జయంతి వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో పర్యటించనున్నారు. ముందుకుగా వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి నివాళులర్పించి… నేరుగా రాధాక్రిష్ణ ఇంటికి వెళ్లి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నరట. ఇప్పటికే రాధాక్రిష్ణ జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ తో చర్చలు జరిపారని దాదాపు జనసేనలో చేరేందుకే మొగ్గుచూపారని తెలుస్తోంది. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి రాధాక్రిష్ణ పీఆర్పీలో చేరారు.
తరువాత కాంగ్రెస్ గూటికి చేరారు. అక్కడ నుంచి వైసీపీలోకి వెళ్లారు. అక్కడ ఇమడలేక తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఎక్కడా రాజకీయంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీనికి తొందరపాటు నిర్ణయాలే కారణమన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి పార్టీమారుతారా? లేదా? అన్నది సందేహం వ్యక్తమవుతోంది. ఒక వేళ చంద్రబాబు పొత్తుల వ్యూహంలో భాగంగా వ్యూహాత్మకంగా రాధాక్రిష్ణను జనసేనలోకి పంపిస్తున్నారా? అన్న అనుమానాలున్నాయి. వంగవీటి కుటుంబం కాపు సామాజికవర్గానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. అటువంటి కుటుంబం నుంచి రాధాక్రిష్ణ జనసేనలో చేరితో అటోమెటిక్ గా కాపు సామాజికవర్గం టీడీపీ జనసేన కూటమి వైపు మరలే అవకాశముందని భావిస్తున్నారు.
తాజా పరిణామాలతో…
ఇప్పటికే కాపులు వైసీపీకి దాదాపు దూరమయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అడుగడుగునా కాపులకు అన్యాయం జరుగుతోంది. అంతకు ముందు చంద్రబాబు కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లను సైతం జగన్ రద్దుచేశారు. కాపులకు ప్రత్యేకంగా ఉన్న పథకాలను సైతం తొలగించారు. దీంతో కాపులు వైసీపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ ను కాదని జగన్ కు పట్టం కట్టామని.. ఇది తప్పుడు చర్యగా గుర్తించారు. గతంలో జరిగిన తప్పిదాన్ని సరిచేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ ఎన్నకల్లో గుంపగుత్తిగా ఓట్లు వేయాలని నిర్థారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాధాక్రిష్ణ జనసేనలో చేరితే కాపుల ఓట్లు ఏకపక్షంగా పడే అవకాశముంది. అందుకే రాధాక్రిష్ణ జనసేనలో చేరేందుకు మొగ్గుచూపారని.. చంద్రబాబు వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతుందన్న టాక్ అయితే నడుస్తోంది. కానీ గత కొన్నేళ్ల నుంచే రాధాక్రిష్ణ జనసేన వైపు ఆశగా ఎదురుచూస్తున్నారన్న టాక్ నడుస్తోంది. విజయవాడ నగరంలో జనసేన శ్రేణులు ఎప్పటి నుంచో వంగవీటి కుటుంబానికి ప్రధాన్యత ఇస్తూ వస్తున్నారు.
Also Read:Menu For Modi: మోడీకి వంట చేస్తున్న కరీంనగర్ మహిళ యాదమ్మ మాటలు వైరల్